"గుడ్ బ్యాడ్ అగ్లీ" ఫస్ట్ షెడ్యూల్ రిపోర్ట్ ఇదే..!

Pulgam Srinivas
కోలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి అజిత్ కుమార్ ప్రస్తుతం గుడ్ బ్యాడ్ అగ్లీ అనే సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి విశాల్ హీరో గా రూపొందిన మార్క్ ఆంటోనీ సినిమాకు దర్శకత్వం వహించి దర్శకత్వం వహించిన మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొని మంచి గుర్తింపును సంపాదించుకున్న అదిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహిస్తున్నాడు.

ఇక ఈ సినిమాని మైత్రి సంస్థ వారు నిర్మిస్తూ ఉండగా ... రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ మూవీ కి సంగీతం అందిస్తున్నాడు. ఇకపోతే కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ యొక్క రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అయింది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ కి సంబంధించిన ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ అయినట్లు తెలుస్తోంది. ఇక ఫస్ట్ షెడ్యూల్ లో ఈ మూవీ బృందం ఈ సినిమాకు సంబంధించిన చాలా కీలక సన్నివేశాలను చిత్రీకరించినట్లు తెలుస్తోంది.

ఈ మూవీ లో కీలక పాత్రలో కనిపించబోయే చాలా మంది నటులు ఈ షెడ్యూల్ లో నటించినట్లు సమాచారం. ఇకపోతే ఈ మూవీ యొక్క సెకండ్ షెడ్యూల్ మరికొన్ని రోజుల్లోనే స్టార్ట్ కాబోతున్నట్లు , అందుకు సంబంధించిన పనులను చాలా స్పీడ్ గా మొదలు పెట్టబోతున్నట్లు తెలుస్తోంది. అజిత్ హీరో గా రూపొందుతూ ఉండడం , అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహిస్తూ ఉండడం , మైత్రి మూవీ సంస్థ నిర్మిస్తున్న ఈ మూవీ కి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తూ ఉండడంతో ఈ మూవీ పై అటు తమిళ్ , ఇటు తెలుగు ప్రేక్షకుల్లో కూడా మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి. మరి ఈ మూవీ ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో , ఏ రేంజ్ విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

ak

సంబంధిత వార్తలు: