ఈవారం ఓటీటీ లోకి ఎంట్రీ ఇచ్చిన సినిమాలు..వెబ్ సీరీస్ లు ఇవే..!

Pulgam Srinivas
ప్రతి వారం లాగానే ఈ వారం కూడా చాలా సినిమాలు , వెబ్ సిరీస్ లు ఓ టీ టీ ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చాయి. అలా ఈ వారం ఓ టీ టీ ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చిన సినిమాలు , వెబ్ సిరీస్ లు ఏవి , ప్రస్తుతం అవి ఏ డిజిటల్ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతున్నాయి అనే వివరాలను తెలుసుకుందాం.
టేనంట్ : సత్యం రాజేష్ ప్రధాన పాత్రలో రూపొందిన ఈ సినిమా కొన్ని రోజుల క్రితమే థియేటర్లో విడుదల అయింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయింది. దానితో తాజాగా ఈ సినిమా ఓ టి టి ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియో ఓ టి టి ఫ్లాట్ ఫామ్ లో తెలుగు భాషలో స్ట్రీమింగ్ అవుతుంది.
105 మినిట్స్ : హన్సిక ప్రధాన పాత్రలో రూపొందిన ఈ సినిమా తాజాగా ఆహా ఓ టీ టీ ఫ్లాట్ ఫామ్ లో తెలుగు భాషలో స్ట్రీమింగ్ అవుతుంది.
మిరల్ : తమిళ నటుడు భరత్ ప్రధాన పాత్రలో రూపొందిన ఈ సినిమా థియేటర్లలో కొన్ని రోజుల క్రితమే తెలుగు భాషలో విడుదల అయ్యి ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. ఇక ఈ సినిమా తాజాగా ఆహా ఓ టీ టీ ప్లాట్ ఫామ్ లోకి తెలుగు భాషలో ఎంట్రీ ఇచ్చింది.
కల్కి : మలయాళ నటుడు టోవినో థామస్ హీరో గా రూపొందిన ఈ సినిమా తాజాగా ఈటీవీ విన్ ఓ టీ టీ ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చింది.
బడే మియా చోటే మియా : అక్షయ్ కుమార్ , టైగర్ షార్ఫ్ హీరోలుగా రూపొందిన ఈ సినిమా కొన్ని రోజుల క్రితమే థియేటర్లలో విడుదల అయింది. ఇక ఈ సినిమా తాజాగా నెట్ ఫ్లిక్స్ లో హిందీ , తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ భాషలలో స్ట్రీమింగ్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

ott

సంబంధిత వార్తలు: