'పుష్ప 2' రీషూట్.. సందిగ్ధంలో ఫ్యాన్స్..?

Anilkumar
టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 'పుష్ప2' సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో అల్లు అర్జున్ కి జంటగా రష్మిక మందాన నటిస్తుంది. ఇప్పటికై ఈ సినిమా నుండి వచ్చిన పాటలు,గ్లిప్స్,టీజర్ సోషల్ మీడియాలో దుమ్ము రేపుతోంది. ఈ సినిమాను movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మైత్రి మూవీ మేకర్స్ వారు భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. అంతేకాకుండా ఈ సినిమాకి రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ ని అందిస్తున్నారు. 

అయితే ఈ మూవీని మేకర్స్ ఆగస్టు 15న గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఈ చిత్రం రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసినప్పటికీ కూడా ఈ సినిమాకి  సంబంధించిన షూటింగ్ ఇంకా పూర్తి కాలేదు. ఈ సినిమాకు సంబంధించిన క్లైమాక్స్ షూటింగ్ జరుగుతోంది. ఇక ఈ షూటింగ్ తర్వాత ఐటెం సాంగ్ షూటింగ్ జరగనుంది. అయితే ఆ ఐటెం సాంగ్ కి యానిమల్ సినిమాలో నటించిన బ్యూటీ తృప్తి నటించనున్నట్లు తాజా సమాచారం. 

ఇక ఇది కాసేపు పక్కన పెడితే సుకుమార్ ఈ సినిమాకు సంబంధించిన అవుట్ పుట్ అంతా చూసిన దర్శకుడు తనకు అంత సాటిస్ఫైడ్ లేదని తెలుస్తోంది. అందుకనే మరోసారి ఈ సినిమాకు సంబంధించిన కీలక సన్నివేశాలను రీ షూట్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇక పోయిన ఏడాదిలో వచ్చిన పుప్ప సినిమా గ్లోబల్ వైల్డ్ గా భారీ విజయాన్ని అందుకునీ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షాన్ని కురిపించింది. ఇక ఈ పుష్ప 2 సినిమా దానికంటే మించి ఉండేలా  నిర్మిస్తున్నారు. ఈసారి పాన్ వరల్డ్ లెవెల్లో సినిమాని రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.  భారీ బడ్జెట్ తో తెరకెక్కబోతున్న ఈ సినిమా ఎంతటి ఘన విజయాన్ని అందుకుంటుందో చూడాలి. ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఇగర్ గా వెయిట్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: