తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన దర్శకులలో బాబి ఒకరు. ఈయన , మాస్ మహారాజా రవితేజ హీరోగా హన్సిక , రెజీనా హీరోయిన్లుగా రూపొందిన పవర్ అనే మూవీతో దర్శకుడిగా కెరియర్ నీ మొదలు పెట్టాడు. ఈ మూవీ మంచి విజయం సాధించడంతో ఈయనకు టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు లభించింది. ఇకపోతే ఆ తర్వాత ఈయన సర్దార్ గబ్బర్ సింగ్ , జై లవకుశ , వెంకీ మామ , వాల్టేరు వీరయ్య అనే సినిమాలకు దర్శకత్వం వహించాడు.
ఇందులో కొన్ని మూవీలు విజయాలు సాధిస్తే , మరికొన్ని అపజాయలను అందుకున్నాయి. ప్రస్తుతం ఈ దర్శకుడు బాలకృష్ణ హీరోగా రూపొందుతున్న సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ దర్శకుడు ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్నాడు. అందులో భాగంగా ఈయన కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పుకొచ్చాడు. తాజా ఇంటర్వ్యూ లో భాగంగా బేబీ మాట్లాడుతూ ... నా కెరియర్ లో కొన్ని సినిమాలు మంచి విజయాలను సాధించాయి.
కొన్ని మూవీలు ఆపజయాలను సాధించాయి. నేను దర్శకత్వం వహించిన సినిమాలలో విజయాలు సాధించిన సినిమాలు అన్నీ కూడా నా కథతో రూపొందినవే , వేరే వాళ్ళ కథతో తెరకెక్కిన సినిమాలు నా కెరియర్ లో ఎప్పుడు విజయాలను సాధించలేదు. అందుకే నేను ఎప్పుడు కూడా నేను తయారు చేసుకున్న కథ తోనే సినిమా చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తూ ఉంటాను. వేరే వాళ్ళ కథతో సినిమాలు చేయడానికి పెద్దగా ఆసక్తి చూపను. అలాగే రీమిక్ సినిమాలు చేయడానికి కూడా పెద్దగా ఆసక్తి చూపను అని తాజా ఇంటర్వ్యూ లో భాగంగా ఈ దర్శకుడు చెప్పుకొచ్చాడు. ఇకపోతే ఈ దర్శకుడు చివరగా వాల్టేరు వీరయ్య సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ మూవీ అదిరిపోయే రేంజ్ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది.