తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన యువ హీరోలలో ఒకరు అయినటువంటి కార్తికేయ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇకపోతే ఈయన ఆర్ ఎక్స్ 100 అనే సినిమాలో హీరో గా నటించి వెండి తెరకు పరిచయం అయ్యాడు. ఈ మూవీ మంచి విజయం సాధించడంతో ఈ నటుడి కి హీరో గా మంచి గుర్తింపు లభించింది. ఆ తర్వాత ఈయన వరుసగా సినిమాల్లో హీరో గా నటిస్తూ వచ్చాడు. అందులో కొన్ని విజయాలు సాధించాయి , కొన్ని అపజయాలు సాధించాయి.
కానీ ఈయనకు నటుడిగా మంచి గుర్తింపు లభించింది. అలాంటి సమయం లోనే ఈ నటుడు నాచురల్ స్టార్ నాని హీరో గా విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో రూపొందిన నాన్ స్ గ్యాంగ్ లీడర్ అనే సినిమాలో ప్రతి నాయకుడి పాత్రలో నటించాడు. ఇక తాజాగా ఈ నటుడు ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్నారుడు. ఆ ఇంటర్వ్యూ లో భాగంగా ఎందుకు ఆ సినిమాలో విలన్ పాత్రలో నటించాల్సి వచ్చింది అనే దాని గురించి చెప్పుకొచ్చాడు.
తాజాగా ఈయన మాట్లాడుతూ ... నాకు విలన్ గా నటించడం ఆ సమయంలో పెద్దగా ఇష్టం లేదు. కానీ విక్రమ్ కుమార్ గారు నాకు వచ్చి ఈ కథ చెప్పి నన్ను ఈ సినిమాలో విలన్ గా ఒప్పించారు. ఇక ఆయన ఒప్పించడం అని ఏని కాదు కానీ నాకు కూడా హీరోలు విలన్ పాత్రలో చేయడం అంటే చాలా బాగా అనిపిస్తుంది. ఆ కారణంతో నేను ఆ సినిమాలో విలన్ పాత్రలో చేశాను అని చెప్పుకొచ్చాడు. ఇకపోతే తాజాగా ఈ నటుడు భజే వాయు వేగం అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ కొన్ని రోజుల క్రితమే థియేటర్ లలో విడుదల అయింది. ప్రస్తుతం ఈ మూవీ విజయవంతంగా థియేటర్ లలో ప్రదర్శించబడుతుంది.