శంకర్ నెక్స్ట్ మూవీ ఆ హీరోతో అస్సలు కాదు..!

Pulgam Srinivas
ఇండియా వ్యాప్తంగా దర్శకుడుగా సూపర్ క్రేజ్ ను సంపాదించుకున్న శంకర్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇకపోతే ఈయన చాలా రోజుల క్రితం కమల్ హాసన్ హీరోగా ఇండియా 3 అనే మూవీ ని మొదలు పెట్టాడు. ఈ సినిమా షూటింగ్ కొంత భాగం పూర్తి అయిన తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ మూవీ ఆగిపోయింది. దానితో కొంతవ్కాలం వెయిట్ చేసినా శంకర్ ఆ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరో గా గేమ్ చేంజర్ అనే మూవీ ని మొదలు పెట్టాడు.

ఈ మూవీ మొదలు అయ్యి కొంత భాగం షూటింగ్ కాగానే మళ్లీ ఇండియన్ 2 సినిమాను తిరిగి ప్రారంభించారు. దానితో శంకర్ ఇటు ఇండియన్ 2 , అటు గేమ్ చేంజర్ రెండు సినిమాల షూటింగ్ లను ఒకే సారి పూర్తి చేస్తూ వచ్చాడు. కొన్ని రోజుల క్రితమే ఇండియన్ 2 షూటింగ్ పూర్తి అయింది. మరో 10 రోజుల్లో గేమ్ చేంజర్ సినిమా కూడా పూర్తి కాబోతున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే శంకర్ కమిట్ అయిన సినిమాలు దాదాపుగా పూర్తి అయ్యే సమయం దగ్గర పడడంతో ఆయన నెక్స్ట్ మూవీ పై అనేక వార్తలు వస్తున్నాయి.

అందులో భాగంగా తమిళ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి అజిత్  కుమార్ తో శంకర్ నెక్స్ట్ మూవీ ఉండబోతున్నట్లు గత కొన్ని రోజులుగా ఓ వార్త వైరల్ అవుతుంది. ఇక ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం వీరిద్దరి కాంబోలో నెక్స్ట్ మూవీ ఉండే అవకాశం లేదు అని తెలుస్తుంది. కొన్ని రోజుల క్రితమే శంకర్ , అజిత్ కలిసినప్పటికీ , వీరు సినిమా గురించి ఏమీ మాట్లాడుకోలేదు అని సమాచారం. మరి శంకర్ తదుపరి మూవీ ఏ హీరోతో ఉంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: