స్పిరిట్ మూవీ ప్రీ ప్రోడక్షన్ వర్క్ స్పీడ్ పెంచిన సందీప్... ప్రజెంట్ ఆ వర్క్..?

Pulgam Srinivas
ఇండియా వ్యాప్తంగా సూపర్ క్రేజ్ కలిగిన హీరోలలో రెబల్ స్టార్ ప్రభాస్ ఒకరు . ఈయన కొంత కాలం క్రితమే సలార్ పార్ట్ 1 మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకున్నాడు . ఇక తాజాగా ఈయన నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన కల్కి 2898 ఏడి అనే పాన్ వరల్డ్ మూవీ లో హీరో గా నటించాడు . ఈ మూవీ ని జూన్ 27 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా థియేటర్ లలో విడుదల చేయనున్నారు .

ఇక ప్రస్తుతం ప్రభాస్ , మారుతీ దర్శకత్వంలో రూపొందుతున్న రాజా సాబ్ అనే మూవీ లో హీరో గా నటిస్తున్నాడు . ఇకపోతే ప్రభాస్ చాలా రోజుల క్రితమే సందీప్ రెడ్డి వంగ దర్శకత్వం లో స్పిరిట్ అనే ఓ మూవీ లో హీరో గా నటించడానికి కమిట్ అయి ఉన్న విషయం మన అందరికీ తెలిసిందే . ఇక ప్రస్తుతం సందీప్ , ప్రభాస్ మూవీ కి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులను వేగవంతంగా చేస్తున్నట్లు తెలుస్తోంది . అందులో భాగంగా చాలా రోజుల క్రితమే ఈ సినిమాకు సంబంధించిన మొత్తం కథను పూర్తి చేసిన సందీప్ ప్రస్తుతం ఈ మూవీ కి డైలాగ్ వర్షన్ రాస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ పని కూడా మరో కొన్ని రోజుల్లోనే పూర్తి కాబోతున్నట్లు సమాచారం. ఇక ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ షూటింగ్ ను కూడా వీలైనంత త్వరగా మొదలు పెట్టబోతున్నట్లు తెలుస్తోంది. సందీప్ కొన్ని రోజుల క్రితమే యానిమల్ అనే మూవీ తో బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకున్నాడు. ఇక ప్రభాస్ , సందీప్ కాంబోలో రూపొందబోయే మూవీ అయినటువంటి స్పిరిట్ పై ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: