ధనుష్ కుబేర షూటింగ్ నుండి వీడియో లీక్.. నెట్టింట వైరల్..!?

Anilkumar
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. కేవలం తమిళ సినిమాలే కాకుండా డైరెక్ట్ గా తెలుగులో కూడా ఇప్పుడు సినిమాలు చేస్తున్నాడు. ఇందులో భాగంగానే ఆయన లేటెస్ట్గా చేస్తున్న సినిమా కుబేర. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా ధనుష్ 51వ సినిమాగా రాబోతోంది. కాగా ఇందులో నేషనల్ క్రష్ గా గుర్తింపు తెచ్చుకున్న రష్మిక మందన హీరోయిన్ గా కనిపించబోతోంది. ఇకపోతే రష్మి ఒకవైపు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న పుష్పటు సినిమాలో నటిస్తూనే ఈ

 సినిమాతో బిజీగా ఉంది. ఇక రష్మిక మందన తోపాటు ఇందులో అక్కినేని నాగార్జున సైతం ఒక కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. అంతేకాదు కొద్ది రోజుల క్రితమే ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ ముంబైలో పూర్తి చేసినట్లుగా సమాచారం వినబడుతోంది. ముంబైలో భారీ షెడ్యూల్ పూర్తి చేసిన చిత్రబృందం రష్మిక ధనుష్ లకి సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలను అందులో షూట్ చేసినట్లుగా సమాచారం.  ఇందులో భాగంగానే ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన ఒక వార్తా సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది.

 అదేంటంటే కుబేర సినిమా షూటింగ్ హైదరాబాదులో జరుగుతోంది. ప్రస్తుతం ధనుష్ మరియు నాగార్జున లకి మధ్య వచ్చే సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఇక అదే విషయాన్ని తెలియజేస్తూ షూటింగ్ లోకేషన్ లో ఉన్న వీడియో ఒకటి ఇప్పుడు లీకై సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. రోప్ తో షూట్ చేస్తున్న ఒక వీడియో నెట్టింత  వైరల్ గా మారింది. అయితే అందులో ధనుష్ చాలా విచిత్రంగా కనిపించాడు. చెదిరిన వెంట్రుకలు మాసిన గుడ్డలతో నవ్వుతూ కనిపించాడు. దీంతో ఈ సినిమాపై రోజురోజుకీ అంచనాలు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన పోస్టర్ విడుదల చేయగా అది కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది. కాగా ఈ సినిమా కేవలం తెలుగులోనే కాకుండా హిందీ తమిళం కన్నడ మలయాళ భాషల్లో కూడా విడుదల కాబోతోంది.. !!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: