తారక్ " దేవర " క్లైమాక్స్ లో ఊహించని ట్విస్ట్..!

lakhmi saranya
స్టార్ డైరెక్టర్ కొరటాల శివ డైరెక్షన్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా రూపొందుతున్న పాన్ ఇండియా మూవీ దేవర. ఇక ఈ మూవీలో జాహ్నవి కపూర్ హీరోయిన్గా నటిస్తుంది. ఇదే ఈమె టాలీవుడ్ మొట్టమొదటి సినిమా. అయితే ఈ చిత్రం క్లైమాక్స్ లో ప్రేక్షకులు ఊహించని ట్విస్ట్ ఉండనుందని సినిమా మొత్తానికే ఆ ట్విస్ట్ అదిరిపోతుందని.. అన్నిటికీ మించి దేవరపాట్ 2 కి ఈ క్లైమాక్స్ లోని బిగ్ ట్విస్ట్ మెయిన్ అని తెలుస్తుంది. అన్న టు దేవర కథకు సంబంధించిన మిస్టరీ పాయింట్ కూడా ఈ క్లైమాక్స్ లోనే రివీల్ చేయనున్నారట.
కాగా ఈ చిత్రం తరువాత షెడ్యూల్ లో సైఫ్ ఆలీ ఖాన్, ఎన్టీఆర్ ల పై రెండు భారీ యాక్షన్ సీక్వెన్స్ లను ప్లాన్ చేశారు. క్లైమాక్స్ లో వచ్చే ఈ యాక్షన్ సీక్వెన్స్ లను అద్భుతంగా రూపొందించారు. ఇక ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ కథానాయకగా నటిస్తూ తన రేంజ్ ని మరింత పెంచుకునే ప్రయత్నం చేస్తుంది. ఇక ఈ చిత్రంలో ఎన్టీఆర్ లుక్ కూడా అదిరిపోయింది.
దేవర పాత్ర కోసం తారక్ డిఫరెంట్ మేకవర్ ట్రై చేశాడు. మొత్తానికి ఈ సినిమా కోసం కొరటాల కూడా బాగా కసరత్తులు చేస్తున్నారు. ఇప్పటికే ఎన్టీఆర్ మరియు కొరటాల కాంబినేషన్లో గతంలో జనతా గ్యారేజ్ అనే సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ లో రికార్డులను తిరగరాసింది. దీంతో వీరి కాంబినేషన్లో మరోసారి వస్తున్న దేవరా సినిమాపై మంచి హైప్స్ ఏర్పడ్డాయి. ఇక ఇప్పటికే రిలీజ్ అయిన దేవరా ఫస్ట్ సాంగ్ అదరగొడుతుంది. మరి ఈ మూవీ రిలీజ్ అనంతరం ఎటువంటి రెస్పాన్స్ దక్కించుకుంటుందో వేచి చూడాలి. ఏక ఈ మూవీ అనంతరం తారక్ వార్ 2 షూటింగ్లో పాల్గొనే సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: