మరో తెలుగు సినిమాకి సైన్ చేసిన నాచురల్ బ్యూటీ.. హీరో ఎవరంటే..?

lakhmi saranya
నేచురల్ బ్యూటీగా పేరు సంపాదించుకున్న ముద్దుగుమ్మ సాయి పల్లవి. ఫిదా చిత్రంతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈమె అనంతరం తనకు అంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది. ఎటువంటి స్క్రీన్ షో చేయకుండా మూవీస్ చేస్తూ ప్రేక్షకుల్లో మంచి గుర్తింపును ఏర్పరచుకుంది. కథకి ప్రాధాన్యం ఉన్న పాత్రలు‌ ఎంచుకుంటున్న ఈ బ్యూటీ ప్రస్తుతం తెలుగులో నాగార్జున సరసన తండేల్ సినిమాలో నటిస్తుంది. ఇక తెలుగుతోపాటు హిందీలో కూడా రెండు భారీ ప్రాజెక్టులు చేస్తుంది ఈ ముద్దుగుమ్మ. అందులో రామాయణం కూడా ఒకటి.
ఇక తమిళంలో అమరన్ లో నటిస్తున్న సాయి పల్లవి ఈ మూవీస్ సెట్స్ పై ఉండగానే తెలుగులో మరొక ఆఫర్కు ఒకే చెప్పింది. రౌడీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా డైరెక్టర్ రవి కిరణ్ కాంబినేషన్లో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇక దీన్ని దిల్ రాజు నిర్మిస్తున్నారు. అందమైన ప్రేమ కథతో రూరల్ మాస్ ఎంటర్టైన్మెంట్ గా రూపొందుతున్న ఇందులో హీరోయిన్గా సాయి పల్లవిని ఫిక్స్ చేసుకున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే ఈ విషయంపై నాచురల్ బ్యూటీ ని సంప్రదించగా చర్చలు పూర్తయినట్లు సమాచారం. అంతేకాకుండా ఈ సినిమా విషయంలో ఆమె పాజిటివ్గా స్పందించినట్లు తెలుస్తుంది.
అంతా అనుకున్నట్లు జరిగితే ఈ చిత్రం వచ్చే ఏడాది సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. అయితే గతంలో విజయ్ దేవరకొండ తో జోడిగా రెండు ఆఫర్లు వచ్చిన వాటిని రిజెక్ట్ చేసిన సాయి పల్లవి ఇప్పుడు ఈ మూవీ కి నిజంగానే ఓకే చెప్పిందా అనే సందేహాలు ఫ్యాన్స్ లో తలెత్తుతున్నాయి. మరి దీంట్లో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే ఇటు విజయ్ దేవరకొండ అయినా అటు సాయి పల్లవి అయినా స్పందించాలి. ఒకవేళ ఇదే కనుక నిజం అయితే లవ్ ట్రాక్ సూపర్ హిట్ అవుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే లవ్ ట్రాక్ సినిమాలకి సాయి పల్లవి పెట్టిన పేరు. ఎటువంటి రొమాన్స్ లేకుండా మొహంలో ఆ ఎక్స్ప్రెషన్స్ ని పలికించగలిగిన ఏకైక హీరోయిన్స్ సాయి పల్లవి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: