"గేమ్ చేంజర్" నుండి అన్ని రోజుల్లో బయటపడనున్న చరణ్..?

Pulgam Srinivas
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చాలా రోజుల క్రితం శంకర్ దర్శకత్వంలో గేమ్ చేజర్ అనే సినిమాను మొదలు పెట్టిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమా మొదలు అయ్యి కొంత భాగం షూటింగ్ పూర్తికా గానే శంకర్ గతంలో మొదలు పెట్టి ఆపి వేసిన ఇండియన్ 2 సినిమాను కూడా మళ్లీ తిరిగి రీ స్టార్ట్ చేయవలసి వచ్చింది. దానితో శంకర్ ఇటు గేమ్ చేంజర్ అటు ఇండియన్ 2 రెండు సినిమాల షూటింగ్ లను ఏక కాలంలో పూర్తి చేస్తూ వచ్చాడు.

దానితో గేమ్ చెంజర్ మూవీ అనుకున్న దాని కంటే చాలా లేట్ అవుతూ వస్తుంది. దీనితో చరణ్ అభిమానులు కూడా ఎప్పుడు ఈ సినిమా షూటింగ్ అవుతుందో , ఎప్పుడు చరణ్ ఈ సినిమా షూటింగ్ నుండి బయటపడతాడు అని ఎదురు చూస్తున్నారు. ఇకపోతే మరికొన్ని రోజుల్లోనే చరణ్ గేమ్ చేంజెర్ సినిమా షూటింగ్ నుండి బయట పడబోతున్నట్టు తెలుస్తుంది.

ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ బృందం వారు ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఆల్మోస్ట్ షూటింగ్ ను కంప్లీట్ చేసినట్లు , మరో 10 రోజుల్లో చరణ్ కు సంబంధించిన షూటింగ్ మొత్తం కంప్లీట్ కానున్నట్లు , దీనితో ఈ సినిమా షూటింగ్ నుండి చరణ్ మరో 10 రోజుల్లో బయట పడబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ మూవీ నీ ఈ ఇయర్ చివరి వరకు విడుదల చేసే ఆలోచనలో ఈ మూవీ బృందం ఉన్నట్లు తెలుస్తుంది. ఈ మూవీ లో కియార అద్వానీ హీరోయిన్ గా కనిపించనుండగా , ఎస్ జే సూర్య ఈ మూవీ లో విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ లో అంజలి ఓ కీలక పాత్రలో కనిపించబోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: