నటి హేమ పై సస్పెన్షన్..!

Pulgam Srinivas
ఇప్పటి వరకు ఎన్నో తెలుగు సినిమాలలో , ఎన్నో పాత్రలలో నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్న నటీమణులలో హేమ ఒకరు. ఈమె నటిగా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకొని ఇప్పటికే ఎన్నో సినిమాలలో నటించింది. ఇది ఇలా ఉంటే కొన్ని రోజుల క్రితం బెంగళూరు పట్టణంలో ఓ రేవ్ పార్టీ జరిగింది అని , ఆ విషయాన్ని తెలుసుకున్న పోలీస్ అధికారులు అక్కడికి చేరుకొని కొంత మంది నీ అరెస్టు చేశారు అని , అందులో తెలుగు సినీ పరిశ్రమకు సంబంధించిన కొంత మంది ప్రముఖులు కూడా ఉన్నారు అని వార్తలు వచ్చాయి.

ఆ తర్వాత అందులో నటి హేమ కూడా ఉంది అని కూడా వార్తలు వచ్చాయి. దానితో హేమ వెంటనే స్పందించి ..  ఓ వీడియోని విడుదల చేసింది. అందులో ఆమె ... నేను బెంగళూరు లో జరిగిన రేవ్ పార్టీకి వెళ్లాను అని , అక్కడ పోలీసులు నన్ను అరెస్టు చేశారు అని , బెంగళూరు పోలీస్ స్టేషన్ లో నన్ను ఉంచారు అని ఇలా అనేక రకాలు వార్తలు వస్తున్నాయి. అవన్నీ అబద్ధం. నేను ఏ రేవ్ పార్టీ కి వెళ్లలేదు. ప్రస్తుతం హైదరాబాదు లోని ఓ ఫామ్ హౌస్ లో ఉన్నాను అని వీడియోను విడుదల చేసింది. ఇక దానితో నిజం గానే హేమ ఏ పార్టీకి వెళ్లలేదు అని జనాలు అంతా భావించారు.

కానీ బెంగుళూరు పోలీసులు హేమ ను అరెస్ట్ చేసాం , ఆమె ప్రస్తుతం మా కస్టడీ లోనే ఉంది అని ఒక ఫోటోను విడుదల చేశారు. ఇక ఆ తర్వాత ఆ పార్టీలో పట్టుకున్న వారందరికీ డ్రగ్ టెస్ట్ చేయగా , అందులో హేమ కు పాజిటివ్ వచ్చినట్లు తెలిసింది. ఇక దానితో ఈ కేసు మరింత ముదిరింది. ఇకపోతే బెంగళూరు రెక్ పార్టీ కేసులో అరెస్ట్ అయినా హేమ యొక్క మా సభ్యత్వాన్ని రద్దు చేశారు. ప్రాథమిక సభ్యత్వం తొలగిస్తూ మా అధ్యక్షుడు మంచు విష్ణు నిర్ణయం తీసుకున్నారు. రేవ్ పార్టీ కేసులో ఆమెకు మా పంపిన నోటీసులపై హేమ స్పందించలేదని సమాచారం. దానితో వివరణ ఇచ్చేంతవరకు ఆమెపై సస్పెన్షన్ కొనసాగనున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: