మనమే ఫ్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు ఇవే..!

Pulgam Srinivas
టాలీవుడ్ టాలెంట్ నటుడు శర్వానంద్ తాజాగా మనమే అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ కి శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించగా ... కృతి శెట్టి ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. వషిం అబ్దుల్ వాహేబ్ సంగీత సారధ్యంలో రూపొందిన ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత టి జి విశ్వ ప్రసాద్ నిర్మించారు. ఈ మూవీ ని జూన్ 7 వ తేదీన థియేటర్లలో విడుదల చేయనున్నారు.

ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ మూవీ కి సంబంధించిన దాదాపు ప్రపంచ వ్యాప్త థియేటర్ హక్కులను మేకర్స్ ఇప్పటికే అమ్మి వేశారు. అందులో భాగంగా ఈ సినిమాకు ఏ ఏరియాలో ఎంత ప్రి రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ ఎన్ని కోట్ల షేర్ కలెక్షన్లను వసూలు చేస్తే క్లీన్ హిట్ గా నిలుస్తుంది అనే వివరాలను తెలుసుకుందాం. ఈ మూవీ కి నైజాం ఏరియాలో 3.5 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరగగా , సీడెడ్ ఏరియాలో 1.5 కోట్లు , ఆంధ్ర ఏరియాలో 5 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జరిగింది. మొత్తంగా ఈ మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాలలో కలిపి 10 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జరిగింది.

ఈ మూవీ కి కర్ణాటక , రెస్ట్ ఆఫ్ ఇండియా మరియు ఓవర్ సీస్ లలో కలుపుకొని 1.5 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జరిగింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ కి 11.50 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జరగగా , ఈ మూవీ 12 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బారిలోకి దిగబోతోంది. ఈ సినిమా కనుక ప్రపంచ వ్యాప్తంగా 12 కోట్ల షేర్ కలక్షన్ లను వసూలు చేసినట్లు అయితే బ్రేక్ ఈవెన్ ఫార్మలాను కంప్లీట్ చేసుకుని క్లీన్ హీట్ గా నిలుస్తుంది. మరి ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి కలెక్షన్లను వసూలు చేసి , ఏ రేంజ్ విజయాన్ని అందుకుంటుందో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: