ఆ ఇంటిని గుడిలా మార్చేసిన ఆదాశర్మ..!?

Anilkumar
ఆదా శర్మ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయక్కర్లేదు. ఎన్నో హిట్ సినిమాలు తన ఖాతాలో వేసుకొని మంచి గుర్తింపును తెచ్చుకుంది . పోయిన ఏడాది ' థి కేరళ స్టోరీ'సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మరో బ్లాక్ బస్టర్ హిట్ సినిమాను తన ఖాతాలో వేసుకుంది. ఇదిలా ఉంటే బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. నాలుగేళ్ల క్రిందట ముంబైలో తన సొంత అపార్ట్మెంట్లో ఆత్మహత్య చేసుకున్నారు. ఇక సుశాంత్ మరణంతో ఆ ఇంటిని  కొనుగోలు చేసేందుకు ఎవరు ముందుకు రాలేదు.

 ముంబైలో ఎంతో పేరు ఉన్న రియల్ ఎస్టేట్ ఏజెన్సీ వాళ్లు కూడా ఈ ఇల్లు అమ్మకం కష్టమే అని తేల్చి చెప్పేశారు. దానితో ఆ ఇల్లు చాలా కాలం అలానే ఉండిపోయింది. అయితే ఆదాశర్మ ఆ ఇంటిని కొనుగోలు చేసే ప్రయత్నంలో ఉంది అంటూ వార్తలు వినిపించాయి. ఇక ఈ విషయం  ఆమె తాజాగా ధ్రువీకరించారు. 'నేను సుశాంత్ సింగ్ ఇంటిని  కొనుగోలు చేశానని ప్రస్తుతం  ఆ ఇంట్లోనే నివసిస్తుంన్నా అంటూ చెప్పుకొచ్చింది. అంతేకాకుండా నెల రోజుల కిందటే ఆ ఇంట్లోకి వచ్చాను అని ఇక మొదటి అంతస్థులు మొత్తం గుడిలా మార్చేశాను.

 టెర్రస్ మొత్తం గార్డెన్ గా మార్చేశాను ఈ ఇంట్లో అడుగుపెట్టగానే నాకు పాజిటివ్ వైబ్ ఆనిపించాయి ఇల్లు ని పూర్తిగా ఆదునీకరించాను అంతేకాకుండా ప్రత్యేకంగా మ్యూజిక్ రూమ్, డాన్స్ స్టూడియోలను ఏర్పాటు చేశాను' అంటూ చెప్పుకొచ్చింది ఆదాశర్మ. ఇక తను చెప్పిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.   సినీ నటి. ఎక్కువగా హిందీ, తెలుగు సినిమాల్లో నటించింది ఆమె. తన స్కూలు చదువు పూర్తియిన వెంటనే 2008లో హిందీ హారర్ సినిమా 1920తో తెరంగేట్రం చేసింది. ఈ సినిమా మంచి హిట్ గా నిలిచింది. ఈ సినిమాలో ఆమె నటనకు ప్రేక్షకుల, విమర్శకుల ప్రశంసలు లభించాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: