నాకు హాట్ ప్రాబ్లం తో పాటు అటువంటి అనారోగ్య సమస్యలు కూడా ఉన్నాయి.. రేణు దేశాయ్ కామెంట్స్..!
అయితే ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఘనవిజయం సాధించడంతో శుభాకాంక్షలు తెలిపింది. అంతేకాకుండా కొడుకు అకీరా నందన్ ను తండ్రితో ఉండమని పంపించింది. ఇక ఇదిలా ఉంటే తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొన్నారు రేణు దేశాయ్ తన ఆరోగ్యానికి సంబంధించిన ఆసక్తికర విషయాలు తెలిపింది. " నాకు ఆరోగ్యం బాగవడం లేదు. అందుకే కొన్ని రోజుల నుంచి నేను రెస్ట్ తీసుకుంటున్నాను. సినిమాలు కూడా చేయడం లేదు. అయితే ఈ సమస్య ముందు మా నానమ్మకు ఉండేది. తరువాత నాన్నకు వచ్చింది ఇప్పుడు నాకు.
మయోకార్డియల్ బ్రీడ్జింగ్ అనే సమస్య వచ్చింది. దానివల్ల ఒక్కోసారి గుండె చాలా స్పీడ్ గా కొట్టుకుంటుంది. పుట్టుకతో నా గుండె అలాగే ఉంది. కానీ ఆ విషయం నాకు కూడా ఈమధ్య తెలిసింది. ఎక్కువ నడిస్తే ఆయాసం రావడం హార్ట్ బీట్ ఎక్కువ అవ్వడం వల్ల ఈ సమస్య గురించి బయటపడింది. ఈ ఆరోగ్య సమస్యకు మందులు వేసుకోవడం వల్ల నేను చాలా లావు అయ్యాను. నాకు ఈ ఒక్క సమస్య కాదు చాలా సమస్యలు ఉన్నాయి. కాబట్టి నేను జాగ్రత్తగా ఉండాలి " అంటూ తెలిపింది రేణు దేశాయ్. ప్రజెంట్ ఈమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాను పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఏమన్నా కానీ ఊరుకోకుండా స్ట్రాంగ్ కౌంటర్స్ కూడా ఇస్తుంది.