"మనమే" పై గంపడన్ని ఆశలు పెట్టుకున్న యంగ్ బ్యూటీ..!

Pulgam Srinivas
అందాల ముద్దుగుమ్మ కృతి శెట్టి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈమె పంజా వైష్ణవ తేజ్ హీరోగా బుచ్చిబాబు సనా దర్శకత్వంలో రూపొందిన ఉప్పెన మూవీ తో వెండి తెరకు పరిచయం అయింది. ఇక ఈ మూవీ విడుదలకు ముందే ఈ సినిమా నుండి విడుదల చేసిన పాటలలోనే ఈమె తన అందాలతో , ఎక్స్ప్రెషన్స్ తో ప్రేక్షకులను కట్టి పడేసింది. ఇక సినిమా విడుదల అయిన తర్వాత మూవీ బ్లాక్ బాస్టర్ విజయం సాధించడంతో ఈమెకు వరుస సినిమాలు క్యూ కట్టాయి.

అందులో భాగంగా ఈమె నటించిన శ్యామ్ సింగరాయ్ , బంగార్రాజు సినిమాలు విజయాలను అందుకున్నాయి. దానితో ఈమె తెలుగులో వరుసగా మూడు విజయాలను అందుకొని హైట్రిక్ ను అందుకుంది. ఇలా వరుసగా మూడు విజయాలను అందుకున్న ఈమె చాలా ఈజీగా టాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ హీరోయిన్ అవుతుంది అని చాలా మంది అనుకున్నారు. కానీ ఆ తర్వాత నుండి ఈమెకు వరుసగా అపజయాలు వచ్చాయి. ఇక ఈ బ్యూటీ ఆ తర్వాత నటించిన మాచర్ల నియోజకవర్గం , ది వారియర్ , ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి.

ఇలా ఈమెకు వరుసగా ప్లాపులు రావడంతో ఈమె కెరియర్ స్లో అయింది. ఇకపోతే తాజాగా ఈ బ్యూటీ మనమే అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది. శర్వానంద్ హీరో గా రూపొందిన ఈ సినిమా జూన్ 7 వ తేదీన విడుదల కానుంది. ఈ మూవీ నుండి ఇప్పటి వరకు మేకర్స్ విడుదల చేసిన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఈ మూవీ మంచి విజయం సాధిస్తే ఈమెకు మళ్ళీ వరుస అవకాశాలు దక్కే ఛాన్స్ ఉంది. దానితో ఈ బ్యూటీ మనమే సినిమాపై గంపడన్ని ఆశలు పెట్టుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

ks

సంబంధిత వార్తలు: