పద్మభూషణ్, పెళ్లి, పవన్ గెలుపు.. లక్కీ మహాలక్ష్మి గా మారిన క్లింకార..!
రెండువేల 23 నవంబర్ 1న బాబాయి వరుణ్ తేజ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠిని పెళ్లి చేసుకున్నాడు. అలాగే మనవరాలు ఇంటికి వచ్చిన కొన్నాళ్లకే తాత మెగాస్టార్ చిరంజీవికి దేశ అత్యున్నత రెండో పౌర పురస్కారం పద్మ విభూషణ్ అవార్డ్ దక్కింది. ఇక ఆ తర్వాత కొన్ని రోజులకే చిన్న తాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఎమ్మెల్యేగా గెలిచి, ఏపీ పాలిటిక్స్ లో మాన్ అఫ్ ది మ్యాచ్ అయ్యారు. 21 స్థానాల్లో పోటీ చేసిన జనసేన పార్టీ.. 21 స్థానాల్లో కూడా అఖండ విజయం అందుకుంది.
అయితే ఇవన్నీ కూడా ఈ బుజ్జి తల్లి పుట్టిన తరువాత జరగడంతో మెగా ప్రిన్సెస్, మెగా ఫ్యామిలీకి లక్కీ మహాలక్ష్మి గా మారిందని పోస్టులు పెడుతున్నారు మెగా అభిమానులు. కాగా ఈ చిన్నారి పుట్టడానికి కొన్ని నెలల ముందు త్రిబుల్ ఆర్ మూవీ తో ఆస్కార్ అవార్డు అందుకున్నారు రామ్ చరణ్. పనిలో పనిగా ఆస్కార్ అవార్డు ని కూడా క్లీంకార ఖాతాలోనే వేశారు. అయితే కొణిదెల క్లీంకార మీడియాకి మరియు సోషల్ మీడియాకి దూరంగా పెంచాలని అనుకుంటున్నారు రామ్ చరణ్ మరియు ఉపాసన. అందుకే ఇప్పటిదాకా పాపకు సంబంధించి ఏ ఫోటోను కూడా సోషల్ మీడియాలో షేర్ చేయలేదు.