"గం గం గణేశా" కి 4 రోజుల్లో వచ్చిన కలెక్షన్స్ ఇవే..!

Pulgam Srinivas
దొరసాని అనే సినిమాతో వెండి తెరకు పరిచయం అయిన ఆనంద్ దేవరకొండ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈయన మొదటి మూవీ తోనే మంచి విజయాన్ని అందుకొని నటుడిగా కూడా తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇకపోతే ఈయన పోయిన సంవత్సరం బేబీ అనే మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు ఈ మూవీ అదిరిపోయే సూపర్ సాలిడ్ విజయాన్ని అందుకోవడంతో ఈయన క్రేజ్ టాలీవుడ్ లో బాగా పెరిగిపోయింది.

బేబీ లాంటి పవర్ఫుల్ హిట్ తర్వాత ఈ నటుడు గం గం గణేశా అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీ 31 వ తేదీన విడుదల అయింది. ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించిన 4 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ కంప్లీట్ అయింది. అందులో భాగంగా ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా ఎన్ని కోట్ల కలెక్షన్లు వచ్చాయి ఇంకా ఎన్ని కోట్ల కలెక్షన్ లను  ఈ మూవీ సాధిస్తే బ్రేక్ ఈవెన్ ఫార్ములా ను కంప్లీట్ చేసుకుని హిట్ స్టేటస్ ను అందుకుంటుంది అనే విషయాలను తెలుసుకుందాం.

నాలుగు రోజుల్లో ఈ మూవీ కి నైజాం ఏరియాలో 86 లక్షల కలెక్షన్లు దక్కగా , ఆంధ్రప్రదేశ్ లో 1.01 కోట్ల కలెక్షన్లు దక్కాయి. మొత్తంగా ఈ సినిమాకి రెండు తెలుగు రాష్ట్రాల్లో 4 రోజుల్లో 1.87 కోట్ల షేర్ , 3.8 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి. ఈ మూవీ కి నాలుగు రోజుల్లో కర్ణాటక , రెస్ట్ ఆఫ్ ఇండియా ఓవర్ సీస్ లో 28 లక్షల కలెక్షన్లు దక్కాయి. మొత్తంగా ఈ సినిమాకి నాలుగు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 2.15 కోట్ల షేర్ , 4.50 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి. ఈ మూవీ కి 5 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరగగా ... ఈ మూవీ 5.50 కోట్ల టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగింది. ఈ మూవీ మరో 3.35 కోట్ల షేర్ కలక్షన్ లను ప్రపంచ వ్యాప్తంగా సాధిస్తే హిట్ స్టేటస్ ను అందుకుంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: