అవును.. నేను రిలేషన్ లో ఉన్నా.. షాకింగ్ నిజాన్ని చెప్పిన బేబమ్మ..!?

Anilkumar
ఉప్పెన సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ అయిపోయింది కృతి శెట్టి. కేవలం ఒకే ఒక్క సినిమాతో స్టార్ హీరోయిన్ రేంజ్ లో క్రేజ్ సంపాదించుకుంది. ఇక ఈ సినిమా తర్వాత తనకి వరుస సినిమాల్లో నటించే అవకాశం వచ్చింది. అలా చాలా సినిమాల్లో నటించింది ఈ బ్యూటీ. కానీ ఆమె చేసిన సినిమాలు ఊహించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేదు. అందుకే కొంతకాలం గ్యాప్ తీసుకుంది  కృతి. ఇందులో భాగంగానే ఇప్పుడు మళ్ళీ సినిమాలతో బిజీ కావాలని చూస్తుంది. తాజాగా ఇప్పుడు మనమే అనే సినిమాతో త్వరలోనే ప్రేక్షకుల

 ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ లో భాగంగా బిజీగా ఉంది. వరుసగా పలు టీవీ చానల్స్ కి ఇంటర్వ్యూ ఇస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తనకి ఎదురవుతున్న అన్ని ప్రశ్నలకు చాలా తెలివిగా సమాధానం ఇస్తూ దాటేస్తుంది ఈ బ్యూటీ. అయితే ఇటీవల ఆమె ప్రమోషన్స్ లో భాగంగా ఒక ఇంటర్వ్యూకి వెళ్లడం జరిగింది. అందులో భాగంగానే తనకి కొన్ని ప్రశ్నలు ఎదురయ్యాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం... మీరు సింగిల రిలేషన్షిప్ లో ఉన్నారా అనే ప్రశ్నలకు స్పందిస్తూ..

 నేను సింగల్ కాదు రిలేషన్ లోనే ఉన్నాను అని సూటిగా సమాధానం చెప్పింది.  ఎవరితో అని అడిగితే నా పనితో.. నా పనితో రిలేషన్ లో ఉన్నాను అంటూ నవ్వుతూ సమాధానం ఇచ్చింది. ఆ తర్వాత నీకు కాబోయే వాడు ఎలా ఉండాలి అని అడిగితే.. మంచివాడై ఉండాలి నిజాయితీపరుడై ఉండాలి సాటివారిపై దయ కలిగిన వాడై ఉండాలి అంటూ సమాధానమిచ్చింది. అంతేకాదు నాకు డాన్స్ చేయడం అంటే చాలా ఇష్టం యాక్షన్స్ సినిమాలు అంటే ఇంకా ఇష్టం అంటూ చెప్పుకొచ్చింది. ఆ తర్వాత మీ ఫేవరెట్ హీరో ఎవరు అని అడిగితే.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అంటూ సమాధానమిచ్చింది. అంతేకాదు మెగా పవర్ స్టార్ తో కలిసిన నటించే అవకాశం వస్తే అసలు వదులుకోను అంటూ చెప్పింది. దీంతో చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. ఇక ఈ వార్త విన్న మెగా పవర్ స్టార్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: