ఎన్టీఆర్ కి పోటీగా రజిని..?

Pulgam Srinivas
సూపర్ స్టార్ రజనీ కాంత్ ప్రస్తుతం టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో రూపొందుతున్న వేట్టాయన్ అనే సినిమాలో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇక ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం శర వేగంగా జరుగుతుంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ ని అక్టోబర్ 10 వ తేదీన విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నట్లు అందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను మరో రెండు , మూడు రోజుల్లో విడుదల చేసే అవకాశం ఉన్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది.

ఇకపోతే ఇదే తేదీన యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరో గా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న దేవర మూవీ ని కూడా విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇక దేవర మూవీ విడుదల తేదీ గా ప్రకటించిన అక్టోబర్ 10 వ తేదీనే రజిని హీరో గా రూపొందుతున్న వేట్టాయన్ మూవీ ని కూడా విడుదల చేసినట్లు అయితే ఈ రెండు సినిమాలకు బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్ల విషయంలో భారీ దెబ్బ తగిలి అవకాశం ఉంది. సూపర్ స్టార్ రజినీ కాంత్ వల్ల దేవర మూవీ కి తమిళ నాడులో కలెక్షన్లు చాలా తక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే దేవర సినిమా వల్ల తెలుగు రాష్ట్రాల్లో వేట్టాయన్ మూవీ కి భారీగా తక్కువ కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది.

అలాగే దేశ వ్యాప్తంగా కూడా ఈ రెండు సినిమాల కలెక్షన్లపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంటుంది. మరి నిజం గానే ఈ రెండు సినిమాలు ఒకే తేదీన విడుదల అవుతాయో లేదో అనేది తెలియాలి అంటే వేట్టాయన్ మూవీ యూనిట్ అధికారికంగా ఈ సినిమా విడుదల తేదీని ప్రకటిస్తేనే తెలుస్తుంది. ఇక ప్రస్తుతానికి అయితే ఈ రెండు సినిమాలపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇకపోతే ఈ రెండు మూవీ లకు కూడా అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నాడు. దానితో ఈ సినిమాల ఆల్బమ్ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: