సూర్యతో రొమాన్స్ కు రెడీ అవుతున్న పూజ హెగ్డే..!!

murali krishna
టాలీవుడ్ ఇండస్ట్రీలో పూజ హెగ్డే అంటే పెద్దగా పరిచయం అక్కర్లేదు. సినిమాలు మొదలు పెట్టిన తొలినాళ్లలో తాను చాలా పేరు తెచ్చుకుంది. తరువాత తరువాత తను ఐరన్ లెగ్ అన్న పేరు తెచ్చుకుంది. సినిమాలకు గ్యాప్ ఇచ్చిన తర్వాత మళ్లీ తన సినీ కెరీర్ ని గాడిలో పెట్టబోతుంది.చాలా గ్యాప్ తర్వాత పూజా హెగ్డే బంపర్ ఆఫర్ కొట్టేసింది. కొద్ది రోజులుగా సరైన ఆఫర్స్ లేక ఈ బుట్టబొమ్మ సైలెంట్ అయిన సంగతి తెలిసిందే.తెలుగులో ఆచార్య, రాధేశ్యామ్లతో వరుస ప్లాప్స్ చూసి ఈ భామ కెరీర్కు బ్రేక్ పడింది. ఇక్కడ క్రేజ్ తగ్గడంతో బాలీవుడ్ బాట పట్టిన పూజకు అక్కడ కూడా కలిసి రాలేదని చెప్పాలి. బాలీవుడు భాయిజాన్ సల్మాన్ ఖాన్తో కిసి కా భాయ్ కిసి కా జాన్ మూవీలో జతకట్టింది. ఈ చిత్రపై పూజా ఎన్నో హోప్స్ పెట్టుకుంది.
కానీ, ఇది ఆమెకు ఆశించిన విజయం ఇవ్వలేదు. బి-టౌన్ బాక్సాఫీసు వద్ద ఈ చిత్రం డిజాస్టర్ కావడంతో హిందీలోనూ ఆమెను పెద్దగా దర్శకనిర్మాతలు పట్టించుకోవడం లేదు. ప్రస్తుతం హిందీలో దేవా అనే మూవీ చేస్తుంది. ఇప్పుడు పూజా ఈ సినిమాపైనే ఆశలన్ని పెట్టుకుంటుంది. ఇక సౌత్లో బీస్ట్తో భారీ పరావడం చూసిన పూజా కోలీవుడ్లోనూ అవకాశాలు రావడం కష్టం అనుకున్నారు. తెలుగు, తమిళంలో ఇక పూజా కెరీర్ అయిపోయిందని అంతా అనుకున్నారు. కానీ ఇప్పుడు అదే కోలీవుడ్లో ఆమె ఓ క్రేజీ ప్రాజెక్ట్లో భాగం అయ్యింది. తాజాగా దీనిపై అధికారిక ప్రకటన వచ్చింది.కోలీవుడ్లో ఇటీవల ఓ క్రేజీ కాంబో సెట్ అయిన సంగతి తెలిసిందే. అదే కార్తీక్ సుబ్బరాజు, సూర్య ప్రాజెక్ట్. సూర్య 44వ సినిమాగా వస్తున్న ఈ సినిమాను ఇటీవల అధికారికంగా ప్రకటించారు. #Suriya44 అనే వర్కింగ్ టైటిల్తో రాబోతున్న ఈ సినిమాలో హీరోయిన్గా పూజా ఫిక్స్ అయ్యింది. స్వయంగా ఈ విషయాన్ని కార్తీక్ సుబ్బరాజు ఆఫీషియల్గా వెల్లడించారు. అంతేకాదు ఈ సినిమాలోని పూజా ఫస్ట్లుక్ కూడా విడుదల చేసి ఆమెను సెట్లోకి ఆహ్వానించారు సుబ్బరాజు. దీంతో పూజా బంపర్ ఆఫర్ కొట్టేసిందంటూ ఫ్యాన్స్ ఖుష్ అవుతున్నారు. ఈ సినిమాతో మళ్లీ ఈ బుట్టబొమ్మ మంచి కంబ్యాక్ ఇవ్వాలని, మళ్లీ ఎప్పటిలాగే వరుస సినిమాలతో అలరించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
కాగా ఇంకా సెట్స్పైకి రాని ఈ సినిమా త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుందట. యాక్షన్ థ్రిల్లర్గా రాబోతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అండమాన్ దీవుల్లోని పోర్ట్బ్లెయిర్లో ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్తో ఈ సినిమా షూటింగ్ను మొదలు పెట్టనున్నట్టు మూవీ టీం ఇప్పటికే ప్రకటించింది. అలాగే ఈ చిత్రం కోసం పలువురు స్టార్ టెక్నీషియన్లు పనిచేస్తుండటం మరో విశేషం. అయితే సుబ్బరాజుర షేర్ చేసిన తొలి పోస్టర్లో మాత్రం పూజా పెళ్లి కూతురు గెటప్లో కనిపించడం మూవీపై అంచనాలు పెంచుతుంది. మరి సస్పెన్స్ యాక్షన్ థ్రిల్లర్గా రాబోతున్న ఈ సినిమాలో పూజా హెగ్డే పాత్ర ఎలా ఉండబోతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: