ఆయన లాంటి గొప్ప నటుడు ఈ ప్రపంచంలోనే లేరు.. డైరెక్టర్ శంకర్ కామెంట్స్ వైరల్..!

lakhmi saranya
డైరెక్టర్ శంకర్ డైరెక్షన్ లో హీరో కమల్ హాసన్ హీరోగా భారీ బడ్జెట్ మూవీ గా ఇండియన్ 2 రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా జూలై 12న తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో భారీ గా రిలీజ్ కానుంది. శనివారం నాడు చెన్నైలో సినీ ప్రేక్షకులు సమక్షంలో ఆడియో వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ క్రమంలో శంకర్ మాట్లాడుతూ.." ఈరోజే సినిమా ఫైనల్ మిక్సింగ్ ను విన్నాను. అనిరుద్ మ్యాజిక్ ను అద్భుతంగా చేశాడు. సంతోషంతో సినిమాకు సరికొత్త ఎనర్జీ వచ్చింది.
ప్రేక్షకులకు కూడా సినిమా చూశాక అదే ఎనర్జీ వస్తుందని భావిస్తున్నా. ఇండియన్ టైం లోనే కమల్ హాసన్ సీక్వెల్ తీర్థమని అడిగారు. కాకపోతే అప్పుడు నా వద్ద సరైన కథ లేదని చెప్పాను. చాలా ఏళ్లకు పేపర్స్ లో లంచం వాళ్ళ జరిగే గోరాలు, అన్యాయాలు చూసి కథ ఇలా రాద్దామా? అలా రాద్దామా? అని అనుకున్నాను. అయితే అప్పుడు నేను కమల్ హాసన్ వేరువేరు ప్రాజెక్టులలో ఉండడంతో కుదరలేదు. రోబో 2.0 తర్వాత ఈ కథ రాసుకున్న.. అలా ఇండియన్ 2 విడుదల అయింది.
మొదటి రోజు షూటింగ్లో ఇండియన్ 2 గతంలో కమల్ హాసన్ చూసి అంతా షాక్ అయ్యారు. 28 ఏళ్ల క్రితం ఎలా కనిపించిందో.. ఇప్పుడు కూడా అలాంటి ఫీలింగ్ కలుగుతుంది. కమల్ హాసన్ అంతా గొప్ప యాక్టర్ ఈ ప్రపంచంలోనే లేరు. ఆయనతో వర్క్ చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఇంత గొప్ప నటుడు ఈ సినిమా చేయడం నాకు మంచి ఫలితాన్ని ఇచ్చింది..." అంటూ తెలిపారు శంకర్. ప్రజెంట్ శంకర్ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ప్రజెంట్ శంకర్ రామ్ చరణ్తో కూడా ఓ సినిమా రూపొందిస్తున్న సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: