మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ ఇప్పుడు తన పేరుని సాయి దుర్గ తేజ్ గా మార్చుకున్న సంగతి తెలిసిందే. ఇటీవల మహిళా దినోత్సవం సందర్భంగా ఒక ప్రెస్ మీట్ లో భాగంగా ఆయన పేరుని సాయి దుర్గ తేజ అనీ మార్చుకుంటున్నట్లుగా అధికారికంగా తెలిపాడు. తన తల్లి పేరు దుర్గ ను తన పేరులో కలుపుకొని సాయి దుర్గ తేజ అని పెట్టుకున్నాడు. ఇక ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తెలియజేశాడు. ఇదిలా ఉంటే యాక్సిడెంట్ తర్వాత సాయి దుర్గ తేజ్ నటించిన విరూపాక్షా సినిమా ఎంతటి బ్లాక్ బాస్టర్ విజయాన్ని
అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఈ స్థాయిలో ఇప్పటివరకు మరొక సినిమాతో హిట్టు కొట్టలేదు తేజ్. ఆ తర్వాత చేసిన బ్రో సినిమా ఫ్లాప్ టాక్ తెచ్చుకోగా ఇప్పుడు డైరెక్టర్ సంపత్ నందితో గంజా శంకర్ అనే సినిమా చేస్తున్నాడు. అయితే తాజాగా ఇప్పుడు వీళ్ళిద్దరికి ఆంబోలో వస్తున్న సినిమా ఆగిపోయింది అన్న ప్రచారం నడుస్తోంది. సినిమా స్టార్ట్ చేసినప్పటి నుండి ఇప్పటివరకు దీనికి సంబంధించిన ఒక్క అధికారిక ప్రకటన కూడా రాలేదు. అయితే తాజాగా ఇప్పుడు ఈ సినిమాను పక్కనపెట్టి మరొక కొత్త సినిమాకి తేజ్ గ్రీన్
సిగ్నల్ ఇచ్చినట్లుగా సమాచారం వినబడుతోంది. అంతేకాదు వారిద్దరి కాంబోలో సినిమాకి అదిరిపోయే టైటిల్ కూడా ఫిక్స్ చేసినట్లుగా తెలుస్తోంది. రోహిత్ దర్శకత్వంలో తేజ్ ఒక సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. కాగా ఈ సినిమాను హనుమాన్ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్నారు. అంతేకాదు సాయి తేజ్ కెరియర్ లోనే ఇది అత్యంత భారీ బడ్జెట్ తో వస్తున్న సినిమా అని అంటున్నారు. ఇక ఈ సినిమా ఏపీ మైనింగ్ బ్యాక్ డ్రాప్ నేపథ్యంలో ఉంటుంది అని అంటున్నారు. అంతేకాదు కేజీఎఫ్ తరహాలో ఈ సినిమా ఉండే అవకాశాలు ఉంటాయని సమాచారం. అయితే ఈ సినిమాకి "సంబరాల ఏటి గట్టు ఎస్ వై జి" అనే టైటిల్ ని ఫిక్స్ చేసినట్లుగా సమాచారం వినబడుతోంది. కానీ దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన మాత్రం ఇప్పటివరకు చేయలేదు.. !!