మహేష్ బాబు, రాజమౌళి మూవీపై అదిరిపోయే అప్డేట్.. సినిమా స్టార్ట్ అయ్యేది అప్పుడే..!?

Anilkumar
ఇటీవల గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సూపర్స్టార్ మహేష్ బాబు ఆ సినిమాతో ఊహించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేక పోయాడు. కలెక్షన్ల పరంగా బాగానే ఆడినప్పటికీ ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది ఈ సినిమా. అయితే దీని తర్వాత మహేష్ బాబు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీస్తున్న సినిమా రాజమౌళి దర్శకత్వంలో రాబోతోంది. ఇక ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు మహేష్ బాబు అభిమానులు. అయితే ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్లు రాబోయే సినిమాపై భారీ అంచనాలు

 ఉన్నాయి. దానికి తగ్గట్లుగానే సినిమా కూడా ప్లాన్ చేస్తున్నట్లుగా ఎంతో కాలంగా వార్తలు వినిపిస్తున్నప్పటికీ దీనికి సంబంధించిన ఒక్క అధికారికి ప్రకటన కూడా ఇప్పటివరకు విడుదల చేయలేదు. అయితే త్రిబుల్ ఆర్ సినిమాతో చివరిగా భారీ విజయాన్ని అందుకున్న రాజమౌళి ఇప్పుడు మహేష్ బాబు తో తీయబోయే సినిమా ఎలా ఉండబోతుందో అని అందరూ ఎంతో ఎక్సైటింగ్ గా ఉన్నారు. ఇక త్రిబుల్ ఆ సినిమా విడుదల ఇప్పటికీ రెండేళ్లు అయిపోయింది. ఇందులో భాగంగానే ఇప్పుడు తన తదుపరి సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్

 పనులతో బిజీగా మారాడు రాజమౌళి. అయితే తాజాగా ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. అది ఏంటంటే.. మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి కోసం సిద్ధమవుతున్నాడు. 'గుంటూరు కారం' విడుదల తర్వాత జనవరిలో జర్మనీ వెళ్లాడు. అక్కడ శిక్షణ కూడా పొందాడు. ఈ శిక్షణ తర్వాత ఆయన ఇండియాకు తిరిగి వచ్చాడు. అప్పటి నుంచి ఈ సినిమా కోసం ప్రిపరేషన్‌లో ఉన్నాడు. మరో రెండు నెలల పాటు ఈ సినిమా కోసం సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. ఆగస్టు నాటికి సెట్స్ పైకి వెళ్లనుందని తెలుస్తోంది. వచ్చే ఏడాది  విడుదలయ్యే అవకాశం ఉంది. రాజమౌళి ఏ సినిమా తీసినా దానికి చాలా ప్రిపేర్ అవుతారు. అలాగే ఇప్పుడు మహేష్ కోసం కూడా చాలా ప్రిపరేషన్ చేస్తున్నారని తెలుస్తోంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: