"గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి" ఓటిటి పార్ట్నర్ లాక్..?

Pulgam Srinivas
తెలుగు సినిమా పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన యువ నటులలో ఒకరు అయినటువంటి విశ్వక్ సేన్ కొంత కాలం క్రితమే గామి అనే సినిమాలో హీరో గా నటించిన మంచి విజయాన్ని అందుకున్నాడు. ఇక గామీ లాంటి సక్సెస్ ఫుల్ మూవీ తర్వాత ఈ నటుడు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అనే అదిరిపోయే మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

కృష్ణ చైతన్య దర్శకత్వం లో రూపొందిన ఈ సినిమాలో మోస్ట్ బ్యూటిఫుల్ నటీమణి అయినటువంటి నేహా శెట్టి హీరోయిన్ గా నటించగా ... అంజలి ఈ మూవీ లో ఓ కీలకమైన పాత్రలో నటించింది. ఈ మూవీ ని సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత సూర్య దేవర నాగ వంశీ ఈ మూవీ ని నిర్మించాడు.

ఈ సినిమా ఈ రోజు అనగా మే 31 వ తేదీన థియేటర్ లలో భారీ ఎత్తున వరల్డ్ వైడ్ గా విడుదల అయింది. ఇకపోతే ఈ సినిమాకు విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే మిక్స్ డ్ టాక్ బాక్స్ ఆఫీస్ దగ్గర లభించింది. మరి ఈ మూవీ మిక్స్ డ్ టాక్ ను అధిగమించి బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ కలెక్షన్ లను వసూలు చేస్తుందో లేదో అనే విషయాన్ని తెలియాలి అంటే మరి కొన్ని రోజులు ఆగాల్సిందే.

ఇకపోతే ఈ సినిమా యొక్క ఓ టీ టీ హక్కులను ఇప్పటికే ఓ ప్రముఖ సంస్థ దక్కించుకున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమా యొక్క డిజిటల్ హక్కులను ప్రముఖ ఓ టీ టీ సంస్థలలో ఒకటి అయినటువంటి నెట్ ఫ్లిక్స్ సంస్థ దక్కించుకున్నట్లు అందులో భాగంగా ఈ సినిమా విడుదల అయిన రెండు నెలల తర్వాత ఈ మూవీ నెట్ ఫ్లిక్స్ ఓ టి టి లో స్ట్రీమింగ్ కానున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది.

ఇకపోతే ఈ సినిమాలో హైపర్ ఆది , సాయి కుమార్ , గోపరాజు రమణ రాజు ముఖ్య పాత్రలు పోషించగా ... యువన్ శంకర్ రాజా ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఇక ఈ మూవీ తో విశ్వక్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ స్థాయి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

vs

సంబంధిత వార్తలు: