అతనితో మినీ డేట్ చేస్తూ అడ్డంగా దొరికిపోయిన మెగా డాటర్ నిహారిక..!?

Anilkumar
మెగా డాటర్ నిహారిక విడాకులు తీసుకొని ప్రస్తుతం తన పర్సనల్ లైఫ్ ఎంజాయ్ చేస్తోంది. అయితే మొదటిగా హీరోయిన్గా పరిచయమైన ఈ బ్యూటీ చైతన్య జొన్నలగడ్డ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. అయితే కొంతకాలం బాగానే కలిసి ఉన్నప్పటికీ ఆ తర్వాత కొన్ని మనస్పర్ధలు రావడంతో ఇద్దరూ విడాకులు తీసుకుని విడివిడి గానే ఉంటున్నారు. ప్రస్తుతం ఎవరి లైఫ్ వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. ఇక విడాకుల తర్వాత సొంతంగా నిర్మాణ సంస్థను ప్రారంభించిన నిహారిక సినిమాలను తెరకెక్కిస్తూ హీరోయిన్గా కూడా నటిస్తోంది. దాంతోపాటు

 సోషల్ మీడియాలో సైతం చాలా ఆక్టివ్ గా ఉంటూ తనకి సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తన అభిమానులతో పంచుకుంటుంది. అయితే ఎప్పుడు తన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో వెకేశన్స్ కి వెళ్తూ ఎంజాయ్ చేస్తూ ఉండే ఈ ముద్దుగుమ్మ తాజాగా తన తండ్రి నాగబాబుతో కలిసి మినీ డేట్ ప్లాన్ చేసింది. అంతేకాదు ఆమె డేట్ కి సంబంధించిన వీడియోని సైతం సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. కాగా ఈ విషయాన్ని నిహారిక స్వయంగా తెలిపింది. తండ్రికి ముద్దులు పెడుతూ

 తన ప్రేమను వలకబోస్తుంది. అయితే నిహారిక నాగబాబుల బాండింగ్ ఎంత అద్భుతంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వీళ్ళిద్దరూ తండ్రి కూతుళ్ళ కంటే మంచి ఫ్రెండ్స్ లాగా ఉంటారు.  ఈ విషయాన్ని చాలా సందర్భాల్లో ఈ తండ్రి కూతుర్లు వెల్లడించారు. ఇక నాగబాబు.కి నిహారిక అన్న నిహారిక కి నాగబాబు అన్న ఎంత ఇష్టమో మనందరికీ తెలిసిందే. ఇకపోతే తాజాగా మెగా డాటర్ నిహారిక షేర్ చేసిన వీడియోలో తన తండ్రి మీద తనకి ఎంత ప్రేమ ఉందో మరోసారి చూపించింది. ప్రస్తుతం ఆ వీడియోని చూసిన నెటిజన్స్ అందరూ తండ్రీ కూతుర్ల ప్రేమను చూసి మురిసిపోతున్నారు. మీ ఇద్దరి బాండింగ్ చాలా అద్భుతంగా ఉంది అంటూ కామెంట్లు సైతం చేస్తున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: