త్రివిక్రమ్, సిద్దూజొన్నలగడ్డ కాంబో.. అంతకుమించి..!!

murali krishna
డీజే టిల్లు సినిమాతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు,మార్కెట్ తెచ్చుకున్నాడు యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ.ఇక గ్యాప్ ఇచ్చి చేసిన టిల్లు స్క్వేర్ హిట్టుతో సిద్దు రేంజ్ నెక్స్ట్ లెవల్ కు చేరుకుంది. ఈ సినిమా ఏకంగా రూ.130 కోట్లకు పైగా వసూళ్లు సాధించి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిల్చి షాక్ ఇచ్చింది. ఈ క్రమంలో ఇప్పుడు సిద్దు చేయబోయే నెక్ట్స్ చిత్రం ఏమిటి..ఎవరితో చేయబోతున్నారనే ఆసక్తి కలగటం సహజం. అయితే తాజాగా మరో చిత్రం కమిటయ్యారు. అది త్రివిక్రమ్ తో అనేసరికి బజ్ క్రియేట్ అవుతోంది. అయితే ఆ ప్రాజెక్టు ఏమిటి మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ...త్రివిక్రమ్ కథ,మాటలు ఇస్తున్న స్క్రిప్టులో సిద్దు జొన్నలగడ్డ చేస్తున్నారు. అలాగే ఈ సినిమాని డైరక్టర్ వెంకీ అట్లూరి డైరక్ట్ చేస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ శ్రీకరా స్టూడియోస్ మరియు ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్‌తో కలిసి ఈ ప్రాజెక్ట్‌ను ముందుకు తీసుకువెళ్తుంది. ఈ ప్రాజెక్ట్‌లో త్రివిక్రమ్ రచయితగా, నిర్మాతగా భారీ వాటాను తీసుకోనున్నాడు. వెంకీ అట్లూరి ప్రస్తుతం దుల్కర్ సల్మాన్ నటించిన లక్కీ బాస్కర్ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఇక సిద్ధూ ఇటీవల తన రెమ్యునరేషన్ పెంచాడు. అతను ఇప్పుడు ఒక చిత్రానికి 15 కోట్లు కోట్ చేస్తున్నాడు. అయితే హీరోగా సిద్దుకి ఇకనుండి అసలైన పరిక్ష అంటోంది ఇండస్ట్రీ. ఎందుకంటే.. టిల్లు పాత్ర అనేది కేవలం సిద్దు బాడీ లాంగ్వేజ్ కి టైలర్ మేడ్ కావటంతో ప్రతీ సారి అలాంటి పాత్రే దొరకదు. ఆ పాత్ర తనకోసం,తనే క్రియేట్ చేసుకున్నాడు కాబట్టి సక్సెస్ అయ్యింది. కానీ, సిద్దు నుండి ఇకనుండి వచ్చి సినిమాలకు హైప్ ఏర్పడుతుంది. కాబట్టి తనని తాను ప్రూవ్ చేసుకోవాల్సిన పరిస్థితి. ప్రస్తుతం సిద్దు ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ తో జాక్, దర్శకురాలు నీరజ కోనతో తెలుసు కదా సినిమాలు చేస్తున్నాడు. ఈ రెండు సినిమాల్లో సిద్దు పాత్రలు, బాడీ లాంగ్వేజ్ సరికొత్తగా ఉండబోతున్నాయని తెలస్తోంది. సిద్దు చేస్తున్న , చేయబోతున్న మూడు సినిమాలపైనే అతని ఫ్యూచర్ ఆధారపడి ఉంటుంది. ఖచ్చితంగా ప్రూవ్ చేసుకోవాల్సిన టైం. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ రెండు సినిమాలు త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: