బాలీవుడ్ కి ఎంట్రీ ఇవ్వబోతున్న యంగ్ హీరోయిన్..!!

murali krishna
తన అందం అభినయంతో  మాస్టారు.. మాస్టారు..అంటూ ప్రేక్షకులను తన వైపు తిప్పుకున్న  యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరోయిన్ సంయుక్త మీనన్. నటన పరంగా విరుపాక్షలో ఆమె చేసిన యాక్టింగ్ కు అందరు ఫిదా అయిపోయారు.ఎని లాంగ్వేజ్ హీరోయిన్ ని తీసుకోండి. అందరకి లక్ష్యం ఒక్కటే.. బాలీవుడ్ లో కూడా తమ సత్తా చాటాలని. తద్వారా నేషనల్ హీరోయిన్ అనిపించుకోవాలనే ఆశతో ఉంటారు.అది అత్యాశ కిందకి కూడా రాదు. నటిగా వాళ్ళకి ఉన్న హక్కు. రీసెంట్ గా సంయుక్త మీన కి కూడా బాలీవుడ్ నుంచి ఆఫర్ వచ్చింది. ఈ నేపథ్యంలో ఆమె పోషిస్తున్న క్యారక్టర్ చర్చినీయాంశ మయ్యింది ప్రభుదేవా, ఒకప్పటి మాజీ హీరోయిన్ కాజోల్ ల కాంబోలో ఒక నూతన చిత్రం తెరకెక్కుతుంది.ఇందులో సంయుక్త మీనన్ కూడా నటించబోతుంది.దీంతో ఆమె తన అందచందాలని ఒక రేంజ్ లో ప్రదర్శించడం ఖాయమని అందరు అనుకున్నారు. ఎందుకంటే బాలీవుడ్ అంటేనే గ్లామర్ షో కి కేర్ ఆఫ్ అడ్రస్. కానీ ఇప్పుడు సంయుక్త ఎటువంటి గ్లామర్ రోల్ లో కనిపించడం లేదు.ప్యూర్ పెర్ ఫార్మెన్స్ ఓరియెంటెడ్ క్యారక్టర్ లో కనిపించబోతుంది.దీంతో మొదటి సినిమాకే బాలీవుడ్ కి తన నటనలో ఉన్న సత్తా చూపించే అవకాశం వచ్చింది. సాయి ధరమ్ తేజ్ హీరోగా వచ్చిన విరూపాక్ష లో ఆమె ప్రదర్శించిన నటనని ఎవరు అంత త్వరగా మర్చిపోరు.2016 లో పాప్ కార్న్ అనే మలయాళ చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేసింది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన భీమ్లా నాయక్ లో రానా కి జోడిగా నటించి తెలుగు ప్రేక్షకులకి కూడా దగ్గరయింది.అక్కడనుంచి ఆమె సినీ ప్రస్థానం చాలా ఫాస్ట్ గా సాగింది. టాప్ హీరోయిలకే సినిమాలు సరిగా లేకపోతుంటే తనకి మాత్రం చేతి నిండా సినిమాలు. . తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషలో కలిసి ఇప్పటి వరకు ఇరవై సినిమాలకు పైనే చేసింది. సార్, విరూపాక్ష, బింబి సార,డెవిల్ లాంటి చిత్రాలు మంచి పేరు తెచ్చిపెట్టాయి. నిఖిల్ న్యూ మూవీ స్వయంభూ లోను చేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: