హైపర్ ఆది పై సీరియస్ అయినా అనిల్ రావిపూడి.. కారణం ఇదే..!

lakhmi saranya
ప్రజెంట్ జనరేషన్ లో డైరెక్టర్స్ కి కూడా మంచి ఫాలోయింగ్ ఏర్పడుతుంది. ఒకానొక సమయంలో స్క్రీన్ పై కనిపించే హీరో మరియు హీరోయిన్.. సైడ్ ఆక్టర్స్ కి గుర్తింపు దక్కేది. కానీ ప్రెసెంట్ ఓ సినిమా హిట్ అయితే ఆ సినిమాని తెరకెక్కించిన డైరెక్టర్ కి మంచి ప్రశంసలు దక్కుతున్నాయి. ఒకప్పుడు తెర వెనుక ఉన్న డైరెక్టర్ ప్రస్తుతం తెరపైకి వచ్చాడు. ప్రజెంట్ హీరో మరియు హీరోయిన్స్ కంటే డైరెక్టర్స్ కే ఎక్కువ పాపులారిటీ దక్కుతుంది. దీంతో ప్రతి డైరెక్టర్ కూడా తనలో ఉన్న టాలెంట్ను కొత్తగా చూపిస్తూ ప్రేక్షకులకు వినోదాన్ని ఇస్తున్నారు.
ఇక కొంతమంది డాక్టర్లు అయితే ఫన్నీ ఫన్నీ జోక్స్ వేస్తూ హీరో అంత పాపులారిటీ సంపాదించుకుంటున్నారు. అటువంటి వారిలో డైరెక్టర్ అనిల్ రావిపూడి కూడా ఒకరు. f2 వంటి సినిమాలతో మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు అనిల్ రావిపూడి. అదేవిధంగా పలుమార్లు ప్రేక్షకులను నవ్విస్తూ మరింత పాపులర్ అయ్యాడు. ఇక ఇటీవల బాలకృష్ణ హీరోగా నటించిన భగవంత్ కేసరి సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చి మరోసారి విజయాన్ని అందుకున్నాడు. ఇక ఇదిలా ఉంటే తాజాగా ఇంటర్వ్యూలో ఐపీఎల్ పై అనిల్ రావిపూడి కొన్ని వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.
ఐపీఎల్ చూడక పోతే కొంపలేని మునిగిపోవు? సినిమాలు చూస్తూ స్కోర్ ని చూసుకోండి సరిపోతుంది. ఐపీఎల్ మీద పడిపోయి సినిమాలను పట్టించుకోకుండా ఉండొద్దు.. అంటూ అనిల్ రావిపూడి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో గట్టిగానే వైరల్ అయ్యాయి. దీంతో ఈనని ఐపిఎల్ ఫ్యాన్స్ ఫుల్ గా ఏకయ్యడం మొదలుపెట్టారు. ఇక తాజా  ఢీ కార్యక్రమానికి గెస్ట్ గా హాజరైన ఈయన హైపర్ ఆది పై ఫైర్ అయ్యాడు. దీనికి కారణం కూడా ఐపిఎల్ ఏ.
ఆది ఐపీఎల్ చూడక పోతే కొంపలో ఏమన్నా మునిగిపోతాయా... అనే లోపే వెంటనే అనిల్ రావిపూడి.. ఏ ఆపే.. ఆపు.. అంటూ ఫైర్ అయ్యాడు. ఆ తర్వాత ఆది మిమ్మల్ని టవర్ చేద్దామని అనేసరికి.. వెంటనే అనిల్ రావిపూడి.. నన్ను నేను కవర్ చేసుకున్నాను. బ్యాటింగ్ మామూలుగా లేదు అక్కడ. వాళ్ల జోలికి వెళ్ళకండి అయ్యా. వాళ్ళు చాలా సెన్సిటివ్ గా ఉన్నారు.. అంటూ కామెడీ చేశాడు. ప్రజెంట్ ఎందుకు సంబంధించిన వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: