ఐశ్వర్య రాయ్ పై విషాన్ని కక్కిన నటి కస్తూరి... ఏమందో తెలుసా?

Suma Kallamadi
కేన్స్ ఫెస్టివల్ గురించి వినే వుంటారు. 1946 నుండి ఈ ఉత్సవాలు జరుగుతున్నాయి. ప్రతి సంవత్సరం సరిగ్గా మేలో కేన్స్ ఫిలిం ఫెస్టివల్ నిర్వహిస్తారు. 1951లో FIAPF (ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్స్)చే ఇది అధికారికంగా గుర్తింపు పొందింది కూడా. దాంతో ప్రపంచం నలుమూలల నుండి డాక్యుమెంటరీలు, షార్ట్ ఫిలిమ్స్ తో సహా అన్ని రకాల కొత్త చిత్రాలను ఇక్కడ ప్రివ్యూ వేస్తారు. ఇంకో విషయం చెప్పాలి. 75 వసంతాల స్వతంత్ర భారతదేశానికి కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో అరుదైన ఘనత దక్కింది. భారత్ కు కేన్స్ చిత్రోత్సవ విపణిలో గౌరవనీయ అధికారిక దేశం హోదా కల్పించడం విశేషంగా చెప్పుకోవచ్చు.
2003లో భారత్ తరుపునుండి జ్యూరీ మెంబర్ గా వ్యవహరించిన మొట్టమొదటి నటి ఐశ్వర్య రాయ్ బచ్చన్. కాగా ఆమె మొదటినుండి ఈ వేడుకలకు హాజరై ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తూ వుంటారు. ఈ ఫెస్టివల్ కు హీరోయిన్లు వెరైటీ దుస్తులలో వెళుతూ ఉంటారు. ఈ క్రమంలో ఒకరిని మించి మరొకరు దుస్తులు ధరిస్తారు. ఈసారి ఐశ్వర్య చేతికి గాయం తగిలినా కూడా వెనక్కి తగ్గలేదు. అద్భుతమైన డ్రెస్సులను ధరించి అందరి మన్ననలు పొందింది... ఒక్క నటి కస్తూరి మనసు తప్ప. అవును, నటి కస్తూరి తాజాగా ఆమెపై సంచలన ఆరోపణలు చేసింది. ప్రస్తుతం ఆ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ కావడం గమనార్హం.
గత 19 ఏళ్ల గా ఈ ఫెస్టివల్ కు ఐశ్వర్య రాయ్ హాజరువుతూ సందడి చేస్తున్న సంగతి విదితమే. ఈ నేపథ్యంలోనే తాజాగా అదిరిపోయే లుక్ లో అక్కడ అమ్మడు ఎంట్రీ ఇచ్చింది. కాగా ఈ ఏడాది ఐశ్వర్య తన కూతురుతో కలిసి అక్కడ కనిపించింది. ఇంతకీ ఐశ్వర్య రాయ్ పై నటి కస్తూరి చేసిన సంచలన వ్యాఖ్యలు ఏమిటనేగా మీ ఆలోచన. ఆమె ఏమన్నారో ఆమె మాటల్లోనే తెలుసుకుందాం. నటి కస్తూరి ఓ పోస్టులో రాసుకొస్తూ... "ఈ ప్రపంచంలోని అత్యంత అందమైన స్త్రీలను కూడా కాలం ఉపేక్షించదు. ఐశ్వర్యరాయ్ గడియారాన్ని వెనక్కి తిప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆమె జీవితం ఓ తెరిచిన పుస్తకం. ఆమె ఒకప్పుడు అందంగానే ఉండేది. కానీ ప్లాస్టిక్ ఆమె కలకాలం అందాన్ని సర్వనాశనం చేసింది. కాలంతో పాటే అన్ని మారతాయి... తప్పదుగా?" అన్నట్లు పోస్ట్ చేసింది. దాంతో ఈ పోస్ట్ తో కస్తూరి మరోసారి వార్తల్లో నిలిచింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: