"లవ్ మీ" నుండి "ఏమవుతుందో" సాంగ్ విడుదల తేదీ...టైమ్ లాక్..!

Pulgam Srinivas
ఆశిష్ రెడ్డి తాజాగా లవ్ మీ అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మనకు తెలిసింది. ఈ మూవీ లో వైష్ణవి చైతన్య హీరోయిన్ గా నటించగా ... అరుణ్ భీమవరపు ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ మూవీ ని మే 25 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ మూవీ నుండి మేకర్స్ అనేక ప్రచార చిత్రాలను , కొన్ని పాటలను విడుదల చేశారు. వాటికి మంచి రెస్పాన్స్ జనాల నుండి లభించింది. ఇకపోతే ఈ మూవీ బృందం వారు తాజాగా ఈ సినిమా నుండి మరో సాంగ్ విడుదలకు సంబంధించిన అప్డేట్ ను ప్రకటించారు.
 

ఈ మూవీ మేకర్స్ తాజాగా ఈ సినిమాలోని ఏమవుతుందో అంటూ సాగే సాంగ్ ను మే 22 వ తేదీన ఉదయం 11 గంటల 07 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేశారు. ప్రస్తుతం ఈ పోస్టర్ వైరల్ అవుతుంది. మరి ఈ సాంగ్ ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి. ఈ మూవీ కి ఎం ఎం కీరవాణి సంగీతం అందించాడు. దానితో ఈ మూవీ ఆల్బమ్ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు మొదటి నుండి ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదల అయిన పాటలు కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడంతో రేపు విడుదల కాబోయే ఏమవుతుందో సాంగ్ పై కూడా ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి.

మరి ఈ సాంగ్ ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి. కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ ఈవెంట్ లో భాగంగా ఆశిష్ మాట్లాడుతూ ... ప్రస్తుతం జనాలు థియేటర్ లకి రావడం లేదు అని కొన్ని థియేటర్ లు మూతపడ్డాయి. మా సినిమాతో మూత పడిన థియేటర్లన్నింటినీ తెరిపిస్తా అంత దమ్ము ఈ సినిమాలో ఉంది అని స్టేట్మెంట్ ఇచ్చాడు. అలా ఈ నటుడు అదిరిపోయే రేంజ్ స్టేట్మెంట్ ఇవ్వడంతో ఈ మూవీ లో మంచి కంటెంట్ ఉంటే ఉండి ఉంటుంది , అందుకే ఈయన ఆ స్థాయిలో స్టేట్మెంట్ ఇచ్చాడు అని పలువురు అభిప్రాయ పడుతున్నారు. మరి ఈ సినిమా ఏ స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: