రామాయణం మూవీలో రావణుని పాత్ర కోసం రియల్ గోల్డ్ వాడనున్నారా..?

Pulgam Srinivas
నితీష్ తివారి ప్రస్తుతం రామాయణం అనే సినిమాను తెరకెక్కిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే . ఈ మూవీ లో హిందీ సినీ పరిశ్రమలో టాప్ కథానాయకులలో ఒకరు అయినటు వంటి రన్బీర్ కపూర్ హీరో గా నటిస్తూ ఉండగా ... సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తోంది . ఇక ఈ మూవీ లో యాష్ ఓ కీలకమైన పాత్రలో కనిపించబోతున్నాడు . ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం యాష్ ఈ మూవీ లో రావణుని పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది . ఈ మూవీ లోని రావణుని కాస్ట్యూమ్స్ విషయం లో మూవీ యూనిట్ ఓ కీలకమైన నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలుస్తోంది.

అసలు విషయం లోకి వెళితే ... రావణుడు స్వర్గ నగరమైన లంకాధిపతి కాబట్టి ఆయన పాత్ర చేసే వ్యక్తి ఈ సినిమాలో వేసుకునే నగలు అన్ని నిజమైన బంగారం అయ్యి ఉండాలి అని మేకర్స్ ఈ పాత్ర కోసం నిజమైన బంగారాన్ని తయారు చేపిస్తున్నట్లు తెలుస్తోంది . అలా ఈ సినిమాలో రావణుని పాత్ర చేయబోయే నటుడు మొత్తం నిజమైన బంగారు నగలను ధరించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి . ఇకపోతే ఈ మూవీ ని రెండు భాగాలుగా తెరకెక్కించబోతున్నట్లు ఇన్ని రోజులు వార్తలు వచ్చాయి.

కానీ ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ ని రెండు భాగాలుగా కాకుండా మూడు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి మేకర్ సన్నాహాలు చేస్తున్నారు తెలుస్తోంది. ఈ మూవీ పై ఇండియా వ్యాప్తంగా సినీ ప్రేమికుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. మరి ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను ఏ స్థాయిలో అందుకుంటుందో చూడాలి. ఈ మూవీ విడుదల తేదీని ఇప్పటి వరకు చిత్ర బృందం ప్రకటించలేదు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ మాత్రం శర వేగంగా జరుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: