అత్యధిక లాభాలను పొందిన టాప్ 10 తెలుగు మూవీలు ఇవే..!

Pulgam Srinivas
ఇప్పటి వరకు భారీ లాభాలను తెచ్చుకున్న టాప్ 11 టాలీవుడ్ మూవీస్ ఏవో తెలుసుకుందాం.

ప్రభాస్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన బాహుబలి 2 సినిమాకి 352 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జరగగా ఈ మూవీ 508 కోట్ల లాభాలను అందుకుంది. ప్రభాస్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన బాహుబలి పార్ట్ 1 మూవీ కి 118 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జరగగా ఈ మూవీ 186 కోట్ల లాభాలను అందుకుంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ,  యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఆర్ ఆర్ ఆర్ మూవీ కి 451 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జరగగా 163.03 కోట్ల లాభాలను అందుకుంది. 

తేజ సజ్జ హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందిన హనుమాన్ సినిమాకి 29.65 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జరగగా ఈ మూవీ 127.95 కోట్ల లాభాలను అందుకుంది. అల్లు అర్జున్ హీరో గా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన అలా వైకుంఠపురంలో సినిమాకి 84.34 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జరగగా 75.88 కోట్ల లాభాలను ఈ మూవీ అందుకుంది. విజయ్ దేవరకొండ హీరోగా పరుశురామ్ దర్శకత్వంలో రూపొందిన గీత గోవిందం సినిమాకి 15 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జరగగా ఈ మూవీ కి 55.43 కోట్ల లాభాలు దక్కాయి. 

ఎఫ్ 2 మూవీ కి 34.5 కోట్ల బిజినెస్ జరగగా ఈ మూవీ కి 50 కోట్ల లాభాలు దక్కాయి. వాల్టేర్ వీరయ్య మూవీ కి 88 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జరగగా 48.85 కోట్ల లాభాలు వచ్చాయి. రంగస్థలం మూవీ కి 80 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జరగగా 47.52 కోట్ల లాభాలు దక్కాయి. కార్తికేయ 2 మూవీ కి 12.8 కోట్ల ఫ్రీ రిలీజ్ జరగగా 45.60 కోట్ల లాభాలు వచ్చాయి. టిల్లు స్క్వేర్ మూవీ కి 27 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జరగగా 42 కోట్ల లాభాలు వచ్చాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: