ఆ మూవీతో మాట నిలబెట్టుకోలేకపోయిన అంజలి..!

MADDIBOINA AJAY KUMAR
సినిమా ఇండస్ట్రీలో మొదట ఓ సినిమాలో ఓ బ్యూటీ నీ హీరోయిన్ గా అనుకొని అందులో భాగంగా ఆమెకు కథను చెప్పిన ఆ సమయంలో ఆమెకు ఆ కథ నచ్చకపోవడం లేదా ఆ బ్యూటీ వేరే సినిమాలతో బిజీగా ఉండడం మరియు మరికొన్ని ఇతర కారణాల వల్ల కొంత మంది కొన్ని సినిమాలను వదిలేస్తూ ఉంటారు. ఇక అలా వదిలి వేసిన సినిమాల్లో వేరెవరో నటిస్తూ ఉంటారు. సినిమా విడుదల అయిన తర్వాత ఆ మూవీ కనుక మంచి విజయం సాధించినట్లు అయితే ఆ రోజు ఆ సినిమా చేసుకుంటే బాగుండేది అని నటి మనలు అనుకుంటారు. అదే ఆ సినిమా కనుక ఫ్లాప్ అయినట్లు అయితే ఆ రోజు ఆ సినిమా చేయకపోవడం ఎంతో మంచిది అయింది.

లేకపోతే కెరీర్ లో ఒక ఫ్లాప్ పడి ఉండేది అని అనుకుంటారు. ఇకపోతే అలా తమన్నా తన కెరీర్ లో ఓ ప్లాప్ నుండి తప్పుకుంటే ... నిధి అగర్వాల్ మాత్రం కెరియర్ నే ఆ ఫ్లాప్ మూవీ తో మొదలు పెట్టింది. ఆ సినిమా ఏది ... అసలు విషయం ఏమిటి తెలుసుకుందాం. నాగ చైతన్య హీరో గా చందు మండేటి దర్శకత్వంలో కొన్ని సంవత్సరాల క్రితం సవ్యసాచి అనే మూవీ రూపొందిన విషయం మనకు తెలిసిందే. ఇందులో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ తోనే ఈ బ్యూటీ తెలుగు తెరకు పరిచయం అయ్యింది.

ఈ సినిమాలో మొదట నిధి అగర్వాల్ స్థానం లో తమన్నా ను హీరోయిన్ గా అనుకున్నారట. అందులో భాగంగా ఈమెకు కథను వివరించగా ఈమె కథ మొత్తం విని ప్రస్తుతం వేరే సినిమాలతో బిజీగా ఉన్నాను. చేయడం కుదరదు అని చెప్పిందంట. దానితో నిధి అగర్వాల్ ని హీరోయిన్ గా ఎంపిక చేసుకున్నారు. ఇక ఈ మూవీ ద్వారా తమన్నా ఒక భారీ ఫ్లాప్ నుండి తప్పుకుంటే ... నిధి అగర్వాల్ మాత్రం ఓ ఫ్లాప్ మూవీ ద్వారా తెలుగు తెరకు పరిచయం అయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: