కొత్త సినిమాలకు బాక్స్ ఆఫీస్ దగ్గర గట్టి పోటీ ఇస్తున్న శర్వా..!

Pulgam Srinivas
శర్వానంద్ హీరోగా రూపొందిన మనమే సినిమా జూన్ 7 వ తేదీన థియేటర్లలో విడుదల అయింది. ఈ సినిమా మొదటి వారం రోజులు మంచి కలెక్షన్లను బాక్స్ ఆఫీస్ దగ్గర వసూలు చేసింది. ఇక రెండవ వారం వచ్చే సరికి సుధీర్ బాబు హీరోగా రూపొందిన హరోం హర , అజయ్ ఘోష్ ప్రధాన పాత్రలో చాందిని చౌదరి కీలక పాత్రలో రూపొందిన మ్యూజిక్ షాప్ మూర్తి , చాందిని చౌదరి ప్రధాన పాత్రలో రూపొందిన వేయమ్ , విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో రూపొందిన మహారాజా సినిమాలు థియేటర్లలోకి వచ్చాయి.

ఇందులో మహారాజా సినిమాకు బ్లాక్ బస్టర్ టాక్ రాగా , హరోం హర చిత్రానికి యావరేజ్ టాక్ వచ్చింది. దానితో ఈ రెండు సినిమాల హవానే ఈ వారం అంతా ఉంటుంది అని జనాలు అనుకున్నారు. కానీ రెండవ వారం లోకి ఎంట్రీ ఇచ్చిన కూడా మనమే సినిమా మంచి హోల్డ్ ను కనబరుస్తూ బాక్సాఫీస్ దగ్గర మంచి కలెక్షన్లను రాబడుతుంది. ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించిన తొమ్మిది రోజుల బాక్స్ ఆఫీస్ రన్ కంప్లీట్ అయింది. అయినప్పటికీ ఈ సినిమా కొత్తగా విడుదల అయిన సినిమాల స్థాయిలో కలెక్షన్లను వసూలు చేస్తూ ముందుకు దూసుకుపోతుంది.

ఇక ఈ దూకుడు చూస్తూ ఉంటే ఈ మూవీ మరో ఒకటి, రెండు రోజుల్లో బ్రేక్ ఈవెన్ ఫార్ములాను కంప్లీట్ చేసుకుని హిట్ స్టేటస్ ను అందుకునేలానే ఉంది. మరి కొంతకాలం క్రితం ఒకే ఒక జీవితం సినిమాతో ప్రేక్షకులను పలకరించి మంచి విజయాన్ని అందుకున్న శర్వానంద్ ఈ సినిమాతో మరో విజయాన్ని అందుకునేలానే ఉన్నాడు. మనమే సినిమాలో మోస్ట్ బ్యూటిఫుల్ నటి కృతి శెట్టి హీరోయిన్గా నటించగా, శ్రీరామ్ ఆదిత్య ఈ మూవీకి దర్శకత్వం వహించాడు. వషిం అబ్దుల్ వహెబ్ ఈ మూవీ కి సంగీతం అందించగా, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత టీ జీ విశ్వ ప్రసాద్ ఈ సినిమాను నిర్మించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: