డాక్టర్ మాట వినొద్దు.. క్యాన్సర్ పేషెంట్ ఏం చెప్పాడంటే?

praveen
నేటి ఆధునిక జీవితంలో మనిషి ఫుల్ బిజీగా మారిపోయాడు. డబ్బు వెంట పరుగులు పెడుతూ పెడుతూ.. చివరికి ఆరోగ్యం గురించి కూడా మర్చిపోతున్నాడు. అంతే కాకుండా మనిషి తినే ప్రతి ఆహారంలో కూడా కల్తీ వచ్చేసింది. ఈ నేపథ్యంలో ఇక సరైన నాణ్యత గల ఆహారం కూడా తినలేని పరిస్థితి నెలకొంది. ఇలాంటి పరిస్థితుల మధ్య ప్రతి ఒక్కరు కూడా ఎన్నో రకాల వ్యాధులతో బాధపడుతున్న దుస్థితి కనిపిస్తూ ఉంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే వివిధ రోగాలతో సంపాదించిన మొత్తాన్ని హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతూ ఖర్చు పెట్టుకుంటున్నారు మనుషులు.

 ఇక ఈ మధ్యకాలంలో ఎక్కువ మందిని వేధిస్తున్న వ్యాధి ఏది అంటే క్యాన్సర్ వ్యాధి అని చెప్పాలి. అయితే క్యాన్సర్ బ్యాది వచ్చిన వాళ్ళు డాక్టర్ చెప్పింది తూచా తప్పకుండా పాటిస్తూ జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడొక క్యాన్సర్ ను జయించిన పేషెంట్ మాత్రం డాక్టర్ మాట అసలు వినొద్దు అని చెప్పడం కాస్త హాట్ టాపిక్ గా మారింది. క్యాన్సర్ వ్యాధి కారణంగా చావు తప్పి కన్ను లొట్ట పోయిన వ్యక్తి రోగులు తమ ఆరోగ్యం గురించి ఎలా ఉండాలో సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టగా.. ఇది వైరల్ గా మారింది. యూఎస్ఏ కి చెందిన డెన్వర్ అనే వ్యక్తి చాలాకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు.

 డాక్టర్ దగ్గర చెక్ అప్ చేయించుకుంటే అంతా బాగానే ఉందని రిపోర్టులు వచ్చాయి. కానీ అతని ఇబ్బందులు మాత్రం తగ్గలేదు. అయితే టెస్ట్ రిపోర్టులు చూసి వైద్యులు కూడా ఏం సమస్య ఉంది అని చెప్పలేకపోయారు. అతను అనుకుంటున్న సమస్యలను కేవలం అతని భ్రమ మాత్రమే అని కొట్టి పారేసారు. ఎంతమంది డాక్టర్ల చుట్టూ తిరిగిన ఉపయోగం లేకుండా పోయింది. అయితే డెన్వర్ నాలుకపై చిన్న కురుపు వచ్చింది. దీంతో ఆందోళన చెందిన అతను సి టెస్ట్ చేయించుకున్నాడు. దీంతో అతనికి క్యాన్సర్ ఉన్నట్లు తేలడంతో అతను దిమ్మెర పోయాడు. చివరికి వైద్యులు అతనికి శస్త్ర చికిత్స చేసి నాలుకలో పావు వంతును తొలగించారు. తన అనుభవాన్ని ఇటీవల సోషల్ మీడియాలో పంచుకున్నాడు. డాక్టర్ చెప్పినట్లుగా బ్లడ్ యూరిన్ టెస్టులు చేసుకుంటే అన్ని రోగాలు బయటపడమని చెప్పుకొచ్చాడు. ఎవరి శరీరం పై వారికి పూర్తి అవగాహన ఉంటుంది కాబట్టి ఎటువంటి మొహమాట పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్ చెప్పింది గుడ్డిగా నమ్మవద్దు అంటూ సూచించాడు సదరు వ్యక్తి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: