ఓ దర్శకుడు నన్ను బెదిరించారు అంటూ షాకింగ్ కామెంట్స్ చేసిన లయ..!!

murali krishna
లయ .. సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్. ఒకప్పుడు తన అంద చందాలతో ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేసిన ఈ బ్యూటీ..రీసెంట్ గానే సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది .స్వయంవరం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన తెలుగు అమ్మాయి లయ. ఆ తర్వాత ప్రేమించు, హనుమాన్ జంక్షన్ లాంటి సినిమాలలో నటించి మంచి పేరు తెచ్చుకుంది.సినిమా ఆఫర్లు పెద్దగా రాకపోయినా.. లయ చేసిన కొన్ని సినిమాలు మాత్రం ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలో సడన్ గా సినిమాలు ఆపేసి పెళ్లి చేసుకుని అమెరికాలో సెటిల్ అయిపోయింది ఈ హీరోయిన్.కాగా గత కొద్దిరోజుల నుంచి ఇంస్టాగ్రామ్ లో యక్టివ్ గా కనిపిస్తూ వచ్చిన లయ ఇప్పుడు మరలా నితిన్ సినిమాతో రీ ఎంట్రీ ఇవ్వనుంది.నితిన్, వేణు శ్రీరామ్ దర్శకత్వంలో చేస్తున్న తమ్ముడు అని సినిమాలో ఆమె నితిన్ అక్క పాత్రలో నటిస్తోంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా ఆమె ఆలీ హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఆలీతో సరదాగా అనే ప్రోగ్రాంకి అతిథిగా హాజరైంది. ఈ ప్రోగ్రాం ప్రోమో ఈ మధ్యనే విడుదల కాగా అది కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఈ ప్రోమోలో లయ చెప్పిన కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను బయటపెట్టారు. ముఖ్యంగా లయ అమెరికా వెళ్లి.. అక్కడ చాలా ఇబ్బందులు పడుతోందని.. రోడ్డు మీద అడుక్కునే స్థితిలో ఉందంటూ వచ్చిన రూమర్స్ గురించి అలీ లయను అడగగా.. దానికి సమాధానంగా లయ ఆవేదన వ్యక్తం చేసింది. అసలు ఏమీ లేకుండా ఎందుకు ఇలాంటి వార్తలు పుట్టిస్తారో తనకు అర్థం కాదని చెప్పుకొచ్చింది. అడుక్కోవడం కంటే దారుణమైన విషయాలు కూడా కొంతమంది యూట్యూబ్ ద్వారా, సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేశారని, అలా చేయడం సరైనది కాదు అని తెలియజేసింది. ఇక అలీతో నటించిన సినిమాల గురించి కూడా ఆమె ప్రస్తావించింది. అప్పటి సినిమా గుర్తులను పంచుకుంది, ఇక తన సినిమా కెరియర్ లో కొన్ని తప్పులు కూడా చేశానని చెప్పి అందరినీ షాక్ కి గురిచేసింది.స్వయంవరం లాంటి మంచి విజయం సాధించిన తర్వాత కోడి రామకృష్ణ దర్శకత్వంలో ఒక సినిమా చేయడం కరెక్ట్ కాదని…అది తాను తీసుకున్న తప్పు నిర్ణయం అని చెప్పుకొచ్చింది. ఆయన అలాంటి స్టార్ డైరెక్టర్ అడిగితే కాదనలేకపోయాను కానీ ఒక పెద్ద హిట్ సినిమా తర్వాత నేను చేసిన చెత్త సినిమా అదేనని తెలియజేసింది. ఇక ఒక పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న డైరెక్టర్ మీ మీద దాడి చేయడానికి ప్రయత్నించాడట కదా అని ఆలీ అడగా.. దానికి సమాధానంగా..'పార్కింగ్లో ఉండగా ఒక డైరెక్టర్ నన్ను ఆపాడు. ఇక్కడి నుంచి నువ్వు అసలు ఎలా వెళ్తావో నేను చూస్తానని అన్నాడు. అయితే నేను అప్పుడు ఎలాగోలా తప్పించుకొని వచ్చేసాను. కానీ ఆ తర్వాత కూడా ఆయన నన్ను ఫాలోఅయ్యాడు. నేను ఒకటే సమాధానం ఇచ్చాను. ఇక్కడ ఎవరూ లేరు ఒంటరిగా ఉన్న.. మీరు ఒంటరిగా ఉన్న నన్ను కావాలంటే చంపేసుకోండి అని నేను చెప్పడంతో.. ఆ వ్యక్తి వెనక్కి తగ్గాడు' అని ఆమె చెప్పుకొచ్చింది. అయితే ఆ వ్యక్తి ఎవరనే విషయం మీద ప్రోమోలో క్లారిటీ ఇవ్వలేదు. బహుశా ఫుల్ ఎపిసోడ్ లో ఆదర్శకుడి పేరేమన్నా బయట పెడతారో లేదో తెలియాలి అంతే మరి కొద్ది రోజులు వేచి చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: