ఆరా మస్తాన్ సర్వే.. మళ్ళీ జగనే సీఎం?

praveen
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నోసార్లు ఎన్నికలు జరిగాయి. కానీ ఎప్పుడు లేనంత ఉత్కంఠ ఈసారి నేలకొంది అన్న విషయం తెలిసిందే. ఎందుకంటే అధికారంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ఓడించేందుకు 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు ఒంటరిగా పోటీ చేయకుండా.. బిజెపి జనసేన పార్టీల మద్దతు కూడగట్టుకుని బరిలోకి దిగారు. మరోవైపు ఇక సీఎం గా ఉన్న జగన్ సొంత చెల్లి షర్మిల కూడా జగన్ ఓడించేందుకు కాంగ్రెస్ తరపున పోటీ చేసింది.

 ఇలా అధికారంలో ఉన్న వైసీపీని గద్దే దించేందుకు అన్ని పార్టీలకు కూడా శతభిదాలుగా ప్రయత్నించాయి అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇక సర్వే రిపోర్టులు కూడా అందరిని కన్ఫ్యూజన్లో పడేసాయ్. ఎందుకంటే కొన్ని సర్వే రిపోర్ట్ లు అటు కూటమి  గెలుస్తుందని చెబితే ఇంకొన్ని సర్వే రిపోర్ట్ లు రెండోసారి వైసీపీ అధికారంలోకి వస్తుందని చెప్పకనే చెప్పాయి. ఇలా ఈ క్రమంలోనే ఎగ్జిట్ పోల్స్ వస్తే గాని ఒక అంచనాకు రాలేమని ఏపీ ప్రజలందరూ కూడా ఫిక్స్ అయిపోయారు   ఈ క్రమంలోనే ఎగ్జిట్ పోల్స్ పై అందరిలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది అని చెప్పాలి.

 ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారం ఎవరికి దక్కబోతుంది అనే విషయంపై.. ఆరా మస్తాన్ సర్వే రిపోర్ట్ లో సంచలన విషయాలు బయటపడ్డాయి. మరోసారి జగన్ సీఎం కాబోతున్నాడు అన్న విషయాన్ని ఆరా మస్తాన్ సర్వే చెబుతుంది. ఏకంగా వైసిపి పార్టీకి 94 నుంచి 104 స్థానాలు రావచ్చని.   ఈ ఎగ్జిట్ పోల్ రిజల్ట్ వెల్లడించింది  అదే సమయంలో టిడిపి జనసేన బిజెపి కూటమికి 71-81 సీట్లల్లో విజయం సాధించి.. ఇక ప్రతిపక్షానికి పరిమితమవుతుందని అంచనా వేసింది. సంక్షేమ పథకాలు కారణంగా ఓటర్లందరూ కూడా తిరిగి జగన్ కి పట్టణం కట్టినట్లు ఆరా మస్తాన్ సర్వే చెబుతుంది. అయితే కూటమి ఇటు వైసిపి కాకుండా ఇతర పార్టీలకు ఒక్క సీటు కూడా దక్కే అవకాశం లేదు అని ఆరా మస్తాన్ సర్వే అంచనా వేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: