ఆరు స‌ర్వేల్లో కుమ్మిప‌డేసిన కూట‌మి... ఆరు సెంచ‌రీలు...!

Purushottham Vinay
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఎన్నడూ లేని విధంగా ఈసారి ఏపీలో ఎన్నికలు హోరాహోరిగా జరిగాయి. గెలుపుపై అటు అధికార పక్షం నేతలు, ఇటు కూటమి నేతలు బాగా నమ్మకంగా ఉన్నారు.మరోసారి అధికారం మాదే అని వైసీపీ నాయకులు ఇంకా ఈసారి విజయం పక్కా అని కూటమి నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే ఎవరి అంచనాలు నిజం కానున్నాయి? అన్నది జూన్ 4న తేలనుంది.దేశవ్యాప్తంగా కూడా ఎన్నికల సమరం ముగిస్తున్న నేపథ్యంలో ఇండియావైడ్ ఎగ్జిట్ పోల్స్ విడుదల అయ్యి సంచలనం సృష్టిస్తున్నాయి.అయితే గత రెండు వారాల క్రితం ముగిసిన ఎన్నికల తర్వాత రకరకాల సర్వేలు, ఎన్నికల పోలింగ్ సరళి ఇంకా అలాగే ఓటు హక్కు వినియోగించుకొన్న తీరుపై అనేక అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఈ క్రమంలో తమదే గెలుపని పార్టీలు ధీమాతో ఉన్నాయి. కాగా, అందరి దృష్టి కూడా ప్రస్తుతం ఎగ్జిట్ పోల్స్ పైనే ఉంది. ఈ ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఏ విధంగా ఉన్నాయి? ఏ సర్వే సంస్థ ఏం చెబుతోంది? అధికారం ఎవరికి దక్కనుంది? అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ క్రమంలో ఎగ్జిట్ పోల్స్ రానే వచ్చేశాయి. ఇక సంస్థల వారిగా ఎగ్జిట్ పోల్స్ ఈ విధంగా ఉన్నాయి..2024 సార్వత్రిక ఎన్నికల ఫలితాలను అంచనా వేసే ఎగ్జిట్ పోల్స్ ను సర్వే ఏజెన్సీలు ప్రకటించడం జరిగింది. లోక్ సభతో పాటు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అంచనాలను కూడా వెల్లడించాయి. కొన్ని ప్రముఖ సంస్థల సర్వేల అంచనాలు దాదాపుగా తెలుగు దేశం కూటమికి అనుకూలంగా ఉన్నాయి.

రైజ్ : టీడీపీ 113 - 122, వైసీపీ 48 - 60,
జనగళం : టీడీపీ 104 - 118, వైసిపీ 44-57,
చాణక్య స్ట్రాటజీస్ : టీడీపీ 114-125, వైసీపీ 39- 49
పయనీర్ : టీడీపీ 144, వైసీపీ 31
పీపుర్స్ పల్స్ : టీడీపీ 111-135, వైసీపీ 45-60
కేకే సర్వీస్ : టీడీపీ 161, వైసీపీ 14

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: