విజయ్ దేవరకొండ సినిమాలో.. చిరంజీవి మెచ్చిన నటుడు?

praveen
నేటి రోజుల్లో ఇండస్ట్రీ లోకి ఎంతో మంది వస్తున్నారు పోతున్నారు. కానీ కొంత మంది మాత్రం తమ కంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటున్నారు. ఈ క్రమం లోనే కేవలం హీరోల పాత్రలకు మాత్రమే పరిమితం కాకుండా ఇక ఎలాంటి వైవిధ్యమైన పాత్ర వచ్చిన చేస్తూ తమకంటూ ప్రేక్షకుల  గుండెల్లో స్థానాన్ని దక్కించుకుంటున్నారు.

 అలాంటి వారిలో హీరో సత్యదేవ్ ఒకరు అని చెప్పాలి. ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన సత్యదేవ్.. తన నటన తో ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. ఎలాంటి పాత్ర ఇచ్చిన కూడా పాత్ర లోకి పరకాయ ప్రవేశం చేస్తూ  తనలోని నటనను ఇప్పటికే ప్రూవ్ చేశాడు. ఈ క్రమం లోనే సినిమా లో ఏదైనా వైవిధ్యమైన పాత్ర ఉంది అంటే చాలు ఆ పాత్ర కోసం దర్శక నిర్మాతలు సత్యదేవ్ ని సంప్రదిస్తూ ఉంటారు అని చెప్పాలి. అయితే ఒకవైపు హీరోగా నటిస్తూనే మరోవైపు ఇతర హీరోల సినిమాల్లో కూడా తన నటనతో ఆకట్టుకుంటూ ఉంటాడు.

 ఇక ఇప్పుడు మరో యంగ్ హీరో సినిమా లో సత్యదేవ్ ఒక కీలక పాత్రలో కనిపించ బోతున్నాడు అంటూ ఒక వార్త టాలీవుడ్ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది. రౌడీ హీరోగా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన విజయ్ దేవరకొండ గౌతమ్ తిన్ననూరితో ఒక సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు అన్న విషయం తెలిసిందే. అయితే ఈ మూవీలో కీలక పాత్రలో సత్యదేవ్ నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ కీలక పాత్రలో ఆయన కనిపించబోతున్నారు అనే విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అయితే ఆల్రెడీ షూటింగ్లో సత్యదేవ్ పాల్గొన్నారట. కాగా ఈ మూవీలో విజయ్ దేవరకొండ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటిస్తోంది. కాగా సత్యదేవ్ గతం లో మెగాస్టార్ తో గాడ్ ఫాదర్ సినిమాలో నటించి ఇక తన నటనతో  చిరంజీవినే మెప్పించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: