డార్లింగ్ ప్రభాస్ ఓటు వెయ్యకుండా ఉండేందుకు పెద్ద కారణమే ఉందిగా...!?

Suma Kallamadi
మే 13న తెలుగు రాష్ట్రాల్లో జరిగిన సార్వత్రిక ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికలలో చాలామంది సినీ సెలబ్రిటీలు తమ ఓటు హక్కును ఉపయోగించుకున్నారు. అయితే యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మాత్రం 2024 ఎన్నికల్లో ఓటు వేయలేదు. ఆయన తన ఓటు హక్కును ఎందుకు అలా వదులుకున్నాడు అనేది సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. సినీ వర్గాల్లో జరుగుతున్న ప్రచారం ప్రకారం, కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల ప్రభాస్ ఓటు వేయకూడదని నిర్ణయించుకున్నట్లు సమాచారం.
ప్రభాస్ హైదరాబాద్‌లోనే సెటిల్ అయ్యాడు. గతేడాది డిసెంబర్ నెలలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగగా అప్పుడు కూడా ప్రభాస్ ఓటు వేయలేదు. దీనికి మెయిన్ రీజన్ ఒకటే అని తెలుస్తోంది. అదేంటంటే ప్రభాస్ కు ఏపీ తెలంగాణలలో భారీగా ఫ్యాన్స్ ఉన్నారు. ప్రభాస్ ఓటు వేయడానికి ఏదైనా పోలింగ్ బూత్ కు వచ్చాడని తెలిస్తే అక్కడికి తండోపతండాలుగా అభిమానులు తరలివచ్చే ప్రమాదం ఉంది. దీనివల్ల ఓటర్లతో పాటు ఎన్నికల అధికారులకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభాస్ తన ఓటు హక్కును వదులుకున్నాడని సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. దీనిపై ప్రభాస్ స్వయంగా పెదవి విప్పితేనే అసలు కారణమేంటనేది తెలుస్తుంది.
 అయితే ప్రభాస్ ఏదో పెద్ద కారణం వల్లే ఓటు హక్కు వినియోగించుకోవడంలేదని అభిమానులు సపోర్టుగా మాట్లాడుతున్నారు. ఆయనను నిందించి తప్పు చేయకూడదని మిగతా వారికి చెబుతున్నారు. అయితే ఎన్టీఆర్ రామ్ చరణ్ లాంటి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న స్టార్లు కూడా ఓటు హక్కును వినియోగించుకున్నారు ఆ సమయంలో ఎలాంటి అభిమానుల హడావుడి లేదు కాబట్టి ప్రభాస్ ఈ కారణంతో ఓటు హక్కును వదులుకుంటే అది తప్పే అవుతుంది అని చెప్పవచ్చు. ఇకపోతే ఈ స్టార్ హీరో ప్రస్తుతం కన్నప్ప మూవీలోని తనకు సంబంధించిన సన్నివేశాలను పూర్తి చేసే పనిలో ఉన్నాడు. ఇందులో ఈ హీరో నందీశ్వరుడిగా కనిపిస్తాడని సమాచారం. శివుడి పాత్రలో నటించమని మేకర్స్ అడిగారట కానీ ఆ పాత్ర కొన్ని కారణాలవల్ల చేయడానికి సిద్ధం కాలేదని తెలిసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: