ప్రభాస్ కల్కి మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే..!?

Anilkumar
టాలీవుడ్ డైరెక్టర్ నాగ అశ్విన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా  తెరకెక్కిస్తున్న సినిమా కల్కి. ఇక ఈ సినిమాలో పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ హీరోగా నటిస్తున్నాడు. కాగా వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.  ఈ సినిమాను దాదాపుగా 700 కోట్లకు పైగానే భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నట్లుగా సమాచారం. ఇండియన్ మైథాలజికల్ అండ్ సైన్స్ ఫిక్షన్ కథాంశంతో వస్తున్న ఈ సినిమాను హాలీవుడ్ రేంజ్ లో ప్లాన్ చేస్తున్నారు. అందుకే ఇప్పటికే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో

 భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే లుక్స్ విజువల్స్ గ్రాఫిక్స్ పరంగా సినిమాలో ఎటువంటి లోటు లేకుండా నెక్స్ట్ లెవెల్ లో ప్లాన్ చేయాలి అని అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నారు మేకర్స్. ఈ క్రమంలోని ఈ సినిమాకి సంబంధించిన ఒక వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అదేంటంటే పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా 2024 జూన్ 27న ప్రపంచ స్థాయిలో విడుదల కావడానికి సిద్ధంగా ఉన్న సంగతి మనందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ సినిమా విడుదల తేదీ దగ్గరపడింది.

 దీంతో సినిమాకి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం శరవేగంగా జరుపుతున్నారు. అందులో భాగంగానే ఈ పనులను త్వరగా పూర్తిచేసి ప్రమోషన్స్ కూడా నిర్వహించే ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇందులో భాగంగా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి డేట్ ఫిక్సైనట్లు ఓ వైపు వార్తలు వినిపిస్తున్నాయి. అందుకు హైదరాబాద్‌లోని ప్రముఖ రామోజీ ఫిలిం సిటీలో ప్రీ రిలీజ్ ఈ వెంట్‌ను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయని టాక్ మొదలయ్యింది. ఈ భారీ ఈవెంట్ మే 22న గ్రాండ్ గా నిర్వహించనున్నారట మేకర్స్. అతి త్వరలోనే ఇందుకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రానున్నట్లు సమాచారం. ఈ సినిమాలో ప్రభాస్ జోడిగా బాలీవుడ్ బ్యూటీస్ దీపికా పదుకొనె, దిశా పటాని నటిస్తుండగా..బిగ్ బి అమితాబ్ బచ్చన్ అశ్వద్ధామగా కనిపించనున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: