సైడ్ లుక్‌లో అచ్చం రామ్ చరణ్ చిన్నప్పటి పోలికలతో మెగా ప్రిన్సెస్..!!

murali krishna
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్-ఉపాసన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. వీరి పెళ్లయ్యాక పదేళ్లకు పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చి మెగా ఇంట్లో సంబరాలు తీసుకొచ్చారు.మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ 'క్లీంకార' రాకతో ఫాదర్ హుడ్ ని ఎంజాయ్ చేస్తున్నారు. ఒక పక్క సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్న చరణ్.. కొంచెం సమయం దొరికినా తన కూతురితో హ్యాపీ టైంని స్పెండ్ చేస్తున్నారు.సోషల్ మీడియాలో క్లింకార పేరు ఎప్పుడు వైరల్ అవుతూనే ఉంటుంది, తాత మెగాస్టార్ చిరంజీవి కన్నా.. నాన్న రామ్ చరణ్ కన్నా క్లింకార పేరే ఎక్కువగా మారుమ్రోగిపోతూ ఉండడం గమనార్హం.మెగా ప్రిన్సెస్ రాకతో మెగాస్టార్ చిరంజీవి ఆనందానికి అవదులు లేకుండాపోయాయి. కానీ ఈ బుజ్జాయి ఫేస్ ఇంతవరకు రివీల్ చేయకపోవడంతో మెగా ఫ్యాన్స్ నిరాశ చెందుతున్నారు. .కాగా రామ్ చరణ్ తన ముద్దుల కూతురి ఫేస్‌ని ఇప్పటివరకు రివీల్ చేయలేదు. అఫీషియల్ గా రివీల్ చేయలేదు గాని, క్లీంకార ఫేస్ చరణ్ పుట్టినరోజునే రివీల్ అయ్యిపోయింది. తిరుమల శ్రీవారి సన్నిధిలో వెంకన్న సమక్షంలో క్లీంకార ఫేస్ కెమెరా లెన్స్ కి చిక్కింది.
అలా పేస్ రివీల్ అయిన తరువాత కూడా రామ్ చరణ్, ఉపాసన.. ఇంకా క్లీంకార ఫేస్ ని చూపించకుండానే వస్తున్నారు. రీసెంట్ గా మదర్స్ డే సందర్భంగా ఉపాసన తన కూతురు కింకారాన్ని ఎత్తుకొని ఉన్న ఫోటోలు షేర్ చేసింది . ఆ ఫోటోలో క్లికార ఫేస్ పై ఎటువంటి ఎమోజీ లేదు . కానీ ఫేస్ రివీల్ చేయలేదు. కానీ ఇలా ఉంటుంది అని ఊహించుకోవచ్చు . ఆ విధంగా షేర్ చేసింది ఉపాసన .ఎప్పుడెప్పుడు క్లీన్ కారా ఫేస్ రివిల్ అవుతుందా..? అని కాచుకొని కూర్చున్న మెగా ఫ్యాన్స్ కు ఇది బాగా దొరికిన ఫోటో. అందుకే సోషల్ మీడియాలో సినిమా ఇండస్ట్రీలో ఈ ఫోటోని బాగా ట్రెండ్ చేశారు. మరి కొంత మంది మెగా ఫాన్స్ రామ్ చరణ్ చిన్నప్పటి ఫోటోతో క్లింకార ఫోటోని మ్యాచ్ చేస్తూ సేమ్ నాన్న లాగే ఉంది అంటూ వాళ్ళిద్దరి ఫొటోస్ నీ వైరల్ చేస్తున్నారు . దీంతో సోషల్ మీడియాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆయన కూతురు క్లింకార చిన్నప్పటి ఫొటోస్ బాగా ట్రెండ్ అవుతున్నాయి.క్లీంకార రాకతో ఉపాసన తన మొదటి మదర్స్ డేని జరుపుకుంటుండడంతో.. మెగా ఫ్యామిలీ కొంచెం స్పెషల్ గానే సెలబ్రేట్ చేసారు. ఇక ఈ మదర్స్ డే సందర్భంగా ఉపాసన.. తన తల్లి మరియు కూతురితో ఉన్న ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేసారు.కాగా మెగా అభిమానులకు ఈ బుజ్జాయిని సైడ్ లుక్ లో చూశాక చిన్నప్పుడు చరణ్ కూడా సేమ్ ఇలాగే ఉన్నాడంటూ ఓ ఓల్డ్ పిక్‌ క్లింకార ఫొటోలకు కింగ్ అండ్ ప్రిన్సెస్ అని క్యాప్షన్ జోడించి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.ఏ మాటక ఆ మాటే సైడ్ కట్స్ నుంచి టోటల్ రామ్ చరణ్ చిన్నప్పటి లాగే ఉంది. పెద్దయ్యాక కూడా రామ్ చరణ్ లాగే కనిపిస్తుంది ఏమో.. ప్రజెంట్ వీళ్ళ ఫొటోస్ చూసి ఎంజాయ్ చేస్తున్నారు మెగా ఫాన్స్. కాగా రామ్ చరణ్ ..గేమ్ చేంజర్ సినిమా షూట్ ఇంకా బ్యాలెన్స్ ఉంది . అంతేకాకుండా బుచ్చిబాబు సనా దర్శకత్వంలో తెరకెక్కే సినిమాను త్వరలోనే సెట్స్ పైకి తీసుకురాబోతున్నాడట . సోషల్ మీడియాలో ఈ సినిమాపై హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నట్లు మెగా అభిమానుల కామెంట్స్ పెడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: