డబుల్ ఇస్మార్ట్: రామ్ బిగ్ హిట్ కొట్టేలా ఉన్నారే?

Purushottham Vinay
టాలీవుడ్ సీనియర్ స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, యంగ్ హీరో రామ్ పోతినేని కాంబోలో వచ్చిన సూపర్ హిట్ మూవీ ఇస్మార్ట్ శంకర్ సీక్వెల్ డబుల్ ఇస్మార్ట్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఏమాత్రం ఆగకుండా శరవేగంగా జరుగుతోంది. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తూ.. డబుల్ ఇస్మార్ట్ మూవీని చాలా గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. మార్చి నెలలో రిలీజ్ కావాల్సిన ఈ మూవీ కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది.అయితే ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతోంది. రామ్ తో పాటు మెయిన్ క్యాస్టింగ్ అంతా ఈ కూడా షెడ్యూల్ లో పాల్గొంటున్నట్లు సమాచారం తెలుస్తోంది. ఇక ఈ సినిమా అప్డేట్ వచ్చి చాలా నెలలు అవుతుండటంతో రామ్ పోతినేని ఫ్యాన్స్ ఎంతో నిరాశ చెందుతున్నారు. దీంతో డబుల్ ఇస్మార్ట్ మేకర్స్ రీసెంట్ గా క్రేజీ అప్డేట్ ని ఇచ్చారు. ఈ మూవీ నుంచి హీరో రామ్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేయడం జరిగింది.ఈ మూవీ టీజర్ ను రామ్ పోతినేని బర్త్ డే సందర్భంగా మే15వ తేదీ రిలీజ్ చేస్తామని అనౌన్స్ చేశారు.


'ది మాక్కికిరికిరీ' డబుల్ ఇస్మార్ట్ టీజర్ మే 15న రానుంది. రెడీగా ఉండండి' అని డైరెక్టర్ పూరి జగన్నాథ్ X లో పోస్ట్ చేశారు. దీంతో రామ్ పోతినేని ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇస్మార్ట్ శంకర్ మూవీకి మించి డబుల్ ఇస్మార్ట్ మూవీ ఉంటుందని చెబుతున్నారు.  మేకర్స్ రిలీజ్ చేసిన రామ్ పోస్టర్ కూడా అందరినీ ఆకట్టుకుంటోంది.ముఖ్యంగా రామ్ ఫ్యాన్స్ ని. ఆ పోస్టర్ లో రామ్ 1000 వాలా చేతికి కట్టుకుని వేరే లెవల్ లో ఊర మాస్ గా ఉన్నారు.క్రేజీ అవుట్ ఫిట్ వేసుకుని మాస్క్ పెట్టుకుని చాలా సీరియస్ గా ఉన్నట్టు చూపించారు మేకర్స్. మొత్తానికి మేకర్స్ ఇచ్చిన అప్డేట్ అదిరిపోయిందని రామ్ ఫ్యాన్స్ చెబుతున్నారు. దీంతో ఈ మూవీ పై అంచనాలు కూడా డబుల్ అయ్యాయి. ఖచ్చితంగా పూరి జగన్నాథ్ రామ్ తో గట్టి హిట్ కొట్టడం పక్కా అని ఫ్యాన్స్ అంటున్నారు.ఇక ఈ సినిమా జులై నెలలో రిలీజ్ అవ్వబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. టీజర్ తో రిలీజ్ డేట్ ప్రకటిస్తారని సమాచారం తెలుస్తుంది. ఇప్పుడు ఈ మూవీ పై ఇంకా మంచి బజ్ క్రియేట్ కావాలంటే.. అది టీజర్ పైనే డిపెండయి ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: