"బేబీ" తర్వాత "గం గం గణేశా" ఆనంద్ కి నిరాశనే మిగల్చనుందా..?

Pulgam Srinivas
టాలీవుడ్ యువ నటుడు ఆనంద్ దేవరకొండ తాజాగా గం గం గణేశా అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ మే 31 వ తేదీన మంచి అంచనాల నడుమ విడుదల అయింది. ఇకపోతే మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమాకు విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర కాస్త నెగిటివ్ టాక్ వచ్చింది. దానితో ఈ సినిమాకు కలెక్షన్లు కాస్త తగ్గాయి. ఇకపోతే ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించిన 5 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ వరల్డ్ వైడ్ గా కంప్లీట్ అయింది. అందులో భాగంగా ఈ సినిమాకు ఏ ఏరియాలో ఏ రేంజ్ కలెక్షన్ లు వచ్చాయి. మొత్తంగా ప్రపంచ వ్యాప్తంగా ఎన్ని కోట్ల కలెక్షన్ లు వచ్చాయి. ఇంకా ఎన్ని కోట్ల కలెక్షన్ లను సాధిస్తే ఈ మూవీ బ్రేక్ ఈవెన్ ఫార్ములా ను కంప్లీట్ చేసుకుని హిట్ స్టేటస్ ను అందుకుంటుంది అనే వివరాలను క్లియర్ గా తెలుసుకుందాం.
5 రోజుల్లో ఈ మూవీ కి నైజాం ఏరియాలో 92 లక్షల కలెక్షన్లు దక్కగా , ఆంధ్రప్రదేశ్ లో 1.08 కోట్ల కలెక్షన్లు దక్కాయి. మొత్తంగా ఈ సినిమాకి రెండు తెలుగు రాష్ట్రాల్లో 5 రోజుల్లో 2 కోట్ల షేర్ , 4.29 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి. ఈ మూవీ కి  5 రోజుల్లో కర్ణాటక , రెస్ట్ ఆఫ్ ఇండియా ఓవర్ సీస్ లో 30 లక్షల కలెక్షన్ లు దక్కాయి. మొత్తంగా ఈ సినిమాకి 5 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 2.30 కోట్ల షేర్ , 4.95 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి. ఈ మూవీ కి 5 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరగగా ... ఈ మూవీ 5.50 కోట్ల టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగింది. ఈ మూవీ మరో 3.20 కోట్ల షేర్ కలక్షన్ లను ప్రపంచ వ్యాప్తంగా సాధిస్తే హిట్ స్టేటస్ ను అందుకుంటుంది. ఇక ఈ మూవీ కి ప్రస్తుతం వస్తున్న కలక్షన్లను బట్టి చూస్తే బేబీ మూవీ తో సూపర్ సక్సెస్ ను అందుకున్న ఈ నటుడు గం గం  గణేశా మూవీ తో అపజయాన్ని అందుకునే అవకాశాలే చాలా వరకు కనిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: