గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి... నెగిటివ్ టాక్ తో ఈ రేంజ్ కలెక్షన్లు ఏంట్రా బాబు..?

Pulgam Srinivas
టాలీవుడ్ యువ నటుడు విశ్వక్ సేన్ కొంత కాలం క్రితం గామి అనే మూవీ తో మంచి సక్సెస్ ను అందుకున్నాడు. ఇక తాజాగా ఈ నటుడు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అనే పక్కా మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీ మే 31 వ తేదీన థియేటర్లలో విడుదల అయింది. ఈ సినిమాలో నేహా శెట్టి హీరోయిన్ గా నటించగా ,  అంజలి ఈ మూవీలో ఓ కీలకమైన పాత్రలో నటించింది. సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత సూర్య దేవర నాగ వంశీ ఈ మూవీ ని నిర్మించాడు. ఈ సినిమా ఇప్పటి వరకు 5 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకుంది. 5 రోజుల్లో ఈ సినిమాకి ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన కలెక్షన్ ల వివరాలను తెలుసుకుందాం.

ఈ మూవీ కి 5 రోజుల్లో నైజాం ఏరియాలో 2.98 కోట్ల కలెక్షన్ లు దక్కగా , సీడెడ్ ఏరియాలో 1.49 కోట్లు , ఉత్తరాంధ్ర లో 90 లక్షలు , ఈస్ట్ లో 61 లక్షలు , వెస్ట్ లో 47 లక్షలు , గుంటూరు లో 54 లక్షలు , కృష్ణ లో 46 లక్షలు , నెల్లూరు లో 33 లక్షల కలెక్షన్ లు దక్కాయి. మొత్తంగా ఈ సినిమాకు 5 రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో 7.78 కోట్ల షేర్ ... 13.45 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి. ఈ మూవీ కి 5 రోజుల్లో కర్ణాటక , రెస్ట్ ఆఫ్ ఇండియాలో 55 లక్షల కలెక్షన్ లు దక్కగా , ఓవర్ సీస్ లో 1.05 కలెక్షన్ లు దక్కాయి. మొత్తంగా ఈ సినిమాకి 5 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 9.38 కోట్ల షేర్  , 17.10 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి. ఈ సినిమాకు 10.30 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరగగా , ఈ మూవీ 11 కోట్ల టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బారిలోకి దిగింది. ఈ సినిమా మరో 1.62 కోట్ల షేర్ కలక్షన్ లను ప్రపంచ వ్యాప్తంగా రాబట్టినట్లు అయితే బ్రేక్ ఈవెన్ ఫార్ములా ను కంప్లీట్ చేసుకుని క్లీన్ గా నిలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

vs

సంబంధిత వార్తలు: