ఈవారం ఓటీటీ లోకి ఎంట్రీ ఇచ్చిన సినిమాలు ఇవే..!

Pulgam Srinivas
ప్రతి వారం లాగానే ఈ వారం కూడా కొన్ని సినిమాలు ఓ టీ టీ ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చాయి. ఆ సినిమాలు ఏవో తెలుసుకుందాం.
గీతాంజలి మళ్లీ వచ్చింది : అంజలి ప్రధాన పాత్రలో రూపొందిన ఈ సినిమా మంచి అంచనాల నడుమ థియేటర్ లలో విడుదల అయ్యి ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఇలా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను అలరించడంలో విఫలం అయిన ఈ సినిమా మే 8 వ తేదీ నుండి ఆహా ఓ టీ టీ ప్లాట్ ఫామ్ లోకి అందుబాటులోకి వచ్చింది. ఇక ప్రస్తుతం ఈ సినిమాకు ఓ టి టి ప్లాట్ ఫామ్ లో పరవాలేదు అనే స్థాయి రెస్పాన్స్ లభిస్తుంది. ఈ మూవీ లో సత్యం రాజేష్ , షకలక శంకర్ , శ్రీనివాస్ రెడ్డి , ఆలీ , సునీల్ , సత్య ముఖ్య పాత్రలలో నటించారు.
లవ్ గురు : విజయ్ ఆంటోనీ హీరో గా రూపొందిన ఈ సినిమా కొన్ని రోజుల క్రితమే థియేటర్ లలో విడుదల అయ్యి ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు. ఇక ప్రస్తుతం ఈ మూవీ యొక్క తెలుగు వర్షన్ అమెజాన్ ప్రైమ్ వీడియో ఓ టి టి ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుంది.
చిత్రం చూడరా : వరుణ్ సందేశ్ హీరో గా రూపొందిన ఈ సినిమా థియేటర్ లలో కాకుండా నేరుగా ఈటీవీ విన్ ఓ టీ టీ ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇకపోతే ఈ సినిమాకి ఓ టి టి ప్లాట్ ఫామ్ లో కూడా ప్రేక్షకుల నుండి పెద్ద స్థాయి రెస్పాన్స్ లభించడం లేదు.
పార్ధు : తాజాగా ఈ మూవీ ఈటీవీ విన్ ఓ టీ టీ ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చింది.
ఈ సినిమాలు ఈ వారం తెలుగు భాషలో ఓ టీ టీ ప్లాట్ ఫామ్ లోకి అందుబాటులోకి వచ్చాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

ott

సంబంధిత వార్తలు: