దేవర సినిమా రిలీజ్ డేట్ లో మరోసారి మార్పులు..!?

Anilkumar
టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న లేటెస్ట్ సినిమా దేవర. కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ జాన్వి కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది .ఇక ఈ సినిమాతోనే జాన్వి కపూర్ టాలీవుడ్ సినీ ఇండస్ట్రీకి పరిచయం అవుతుంది. కాగా ఈ సినిమాలో జాహ్నవి కపూర్ తో పాటు బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రలో కనిపించబోతున్నారు. ఈ సినిమాకి మ్యూజిక్  అనిరుధ్ అందిస్తున్నారు. ఇక ఇంతమంది స్టార్స్ సినిమాలో ఉండడంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎంత ఆసక్తిగా ఎదురు

 చూస్తున్నారు సినీ లవర్స్. అయితే ఈ సినిమాని ముందుగా ఏప్రిల్ 5న విడుదల చేస్తాము అని  ప్రకటించారు. కానీ ఊహించిన విధంగా సినిమాకి సంబంధించిన షూటింగ్ ఆలస్యం కావడంతో సినిమాను దసరా కానుకగా అక్టోబర్ 10న విడుదల చేస్తాము అని ఆ తరువాత ప్రకటించారు మేకర్స్ .అయితే తాజాగా ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన రిలీజ్ డేట్ మరింత ఆలస్యం కాబోతోంది అన్న వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వినబడుతున్నాయి. అయితే తాజాగా జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న దేవర సినిమా రిలీజ్ డేట్ మరోసారి

 వాయిదా పడే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం దేవరా సినిమాకి సంబంధించిన రిలీజ్ డేట్ లో మార్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయి అని సినీ ఇండస్ట్రీలో వార్తలు వినబడుతున్నాయి. అయితే ఊహించని విధంగా అనుకున్న సమయాని కంటే వారం లేదా రెండు వారాల ముందే సినిమాను రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఆ విధంగా మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లుగా సమాచారం. దీనితో ఈ సినిమా షూటింగ్ పనులను త్వరత్వరగా జరిపేందుకు మేకర్స్ చూస్తున్నట్లు తెలుస్తుంది .బిగ్గెస్ట్ పాన్ ఇండియా చిత్రం గా వస్తున్న ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.ఈ సినిమాలో సముద్రం బ్యాక్‍డ్రాప్‍లో వచ్చే హైవోల్టేజ్ భారీ యాక్షన్ సీక్వెన్స్‌ ప్రేక్షకుల చేత విజిల్స్ వేయించేలా ఉండనున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: