సినిమా ఆఫర్స్ కోసం ఏకంగా అలాంటి పనులు చేసిన సిరి హనుమంతు..!?

Anilkumar
బిగ్బాస్ సీజన్ 5లో ఆడి పాడిన సిరిహనుమంతు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే గతంలో ఈమె పలు షార్ట్ ఫిలిమ్స్ చేసి పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది. అలా బిగ్ బాస్ ఆఫర్ రావడంతో బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. అంతేకాదు తోటి యూట్యూబ్ షణ్ముఖ్ జస్వంత్ తో స్నేహం పేరుతో రొమాన్స్ కూడా చేసింది. ఒకరి పట్ల మరొకరు చాలా ఆప్యాయంగా ఉండేవారు కొట్టుకోవడం తిట్టుకోవడం అలగడం మళ్ళీ బ్రతిమలాడడం కలిసిపోవడం ఇలా హౌస్ లో వీళ్ళిద్దరి జర్నీ చూసి బయటి వారందరూ షాక్ అయ్యారు. అయితే ఇదంతా చూసి తట్టుకోలేని షణ్ముఖ లవర్ దీప్తి సునయన అతనితో బ్రేకప్ చేసుకుంది.

కాగా జబర్దస్త్ నుండి ఇటీవల అనసూయ తప్పుకోగా సౌమ్యను యాంకర్ గా పెట్టుకున్నారు. అయితే ఆమెతో ఆశించిన స్థాయిలో జబర్దస్త్ కి సక్సెస్ రాకపోవడంతో ఆమెను తప్పించి సిరి హనుమంతును తీసుకువచ్చారు. తెలుగమ్మాయి కావడంతో జబర్దస్త్ కమెడియన్స్ వేసే పంచులకు బాగానే రియాక్ట్ అవుతుంది.  తాజాగా ఇప్పుడు నూకరాజు సిరి హనుమంతు గురించి పలు కామెంట్లు చేశాడు. దీంతో ఆయన చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజా ఎపిసోడ్లో నూకరాజు సిరి హన్మంత్ గురించి చేసిన

 కామెంట్స్ వైరల్ గా మారాయి. స్కిట్ లో భాగంగా నూకరాజు అరిగిపోయిన చెప్పులు చూపించాడు. అవి ఎవరివి అనగా... సిరి హన్మంత్ వి అన్నాడు. ఆఫర్స్ కోసం ఆఫీసులు చుట్టూ తిరిగి తిరిగి ఆమె చెప్పులు అరిగిపోయాయని... పంచ్ వేశాడు. మరి ఆఫర్స్ వచ్చాయా అని అడగ్గా.. లేదు మోకాళ్ళు అరిగాయని మరో పంచ్ వేశాడు. దాంతో సిరి ముఖం మాడ్చుకుంది.  ఏ నటి అయినా కెరీర్ ప్రారంభంలో చేయాల్సిన పనే ఇది. ఇప్పుడు స్టార్స్ గా ఎదిగిన వారు గతంలో ఫోటోలు పట్టుకొని నిర్మాతలు, దర్శకుల చుట్టూ ప్రదక్షిణలు చేసి ఉంటారు. నటి కావడం చాలా కష్టం. సిరి హన్మంత్ అందుకు మినహాయింపు కాదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: