అల్లరి నరేష్ తాజాగా "ఆ ఒక్కటి అడక్కు" అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా నటించగా ... మళ్లీ అంకం ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ మూవీ మంచి అంచనాల నడుమ మే 3 వ తేదీన థియేటర్ లలో విడుదల అయింది. మంచి అంచనాల నడుమ థియేటర్ లలో విడుదల అయిన ఈ సినిమాకు విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కు బాక్స్ ఆఫీస్ దగ్గర కాస్త మిక్స్ డ్ టాక్ లభించింది. అయినప్పటికీ అల్లరి నరేష్ చాలా సంవత్సరాల తర్వాత నటించిన ఫుల్ లెన్త్ కామెడీ ఎంటర్టైనర్ మూవీ కావడంతో ఈ సినిమాకు ప్రజలు కొంచెం కనెక్ట్ అయినట్టే కనిపిస్తోంది.
దానితో ఈ మూవీ కి మొదటి వీకెండ్ లో భారీగానే కలెక్షన్ లు వచ్చినట్లు సమాచారం. ఇకపోతే తాజాగా ఈ మూవీ బృందం ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా రెండు రోజుల్లో వచ్చిన కలెక్షన్ లకి సంబంధించిన అధికారిక ప్రకటనను విడుదల చేశారు. ఈ మూవీ కి విడుదల అయిన మొదటి రోజు కంటే రెండవ రోజు ఎక్కువ కలెక్షన్ లు వచ్చినట్లు మొత్తంగా రెండు రోజుల్లో కలిపి ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా 3.34 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు వచ్చినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను విడుదల చేశారు. ప్రస్తుతం ఆ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఇకపోతే కొంత కాలం క్రితమే అల్లరి నరేష్ "నా సామి రంగ" అనే సినిమాలో ఓ కీలకమైన పాత్రలో నటించాడు. ఈ మూవీ మంచి విజయం అందుకుంది. అలాగే ఈ మూవీ లోని నరేష్ నటనకు కూడా ప్రేక్షకుల నుండి విమర్శకుల నుండి మంచి ప్రశంసలు దక్కాయి. అలా నా సామి రంగ మూవీ తో ఈ సంవత్సరం ఇప్పటికే ఓ విజయాన్ని అందుకున్న నరేష్ మరి ఆ ఒక్కటి అడక్కు సినిమాతో ఆ రేంజ్ సక్సెస్ ను అందుకుంటాడో లేదో చూడాలి.